Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం 'పుష్ప'. మైత్రీ మూవీ మేకర్స్ మరో నిర్మాణ సంస్ధ ముత్తంశెట్టి మీడియాతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఆగస్ట్ 13న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ అప్ డేట్స్ కోసం అల్లు అర్జున్ అభిమానులతోపాటు ప్రేక్షకులు సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాకి సంబంధించిన ప్రీల్యూడ్ని దర్శక,నిర్మాతలు శనివారం విడుదల చేశారు. దీనికి అద్భుతమైన స్పందన లభించడం పట్ల చిత్ర యూనిట్ ఆనందం వ్యక్తం చేసింది. ఏప్రిల్ 7, సాయంత్రం 6.12 నిమిషాలకు 'పుష్ప'రాజ్‌ను ప్రేక్షకులకు పరిచయం చేయనున్నారు. ఈ సినిమాలో ప్రతినాయకుడిగా జాతీయ అవార్డు గ్రహిత, మలయాళ స్టార్ హీరో ఫహాద్ ఫాజిల్ నటిస్తున్నారు. ఫహాద్ నటించిన పలు మలయాళ చిత్రాలు తెలుగుతో పాటు పాన్ ఇండియా వైడ్ కూడా సినీ అభిమానుల ఆదరణ దక్కించుకున్నాయి. 'ఈ చిత్రంలో పుష్పరాజ్ బన్నీకి జోడిగా రష్మిక నటిస్తుంది. రష్మిక లుక్ కూడా చాలా నేచురల్‌గా ఉంటుంది. ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ అందించిన ఆడియో హైలెట్‌గా నిలుస్తుంది. అల్లుఅర్జున్, సుకుమార్, దేవిశ్రీ ప్రసాద్ కాంబినేషన్లో ఆడియోకి ఒక క్రేజ్ ఉంటుంది. అలాగే మైత్రిమూవీస్, దేవి శ్రీ ప్రసాద్ కాంబినేషన్లో వచ్చే ఆడియోకీ ఓ క్రేజ్ ఉంటుంది. ఇప్పడు వీరందరి కాంబినేషన్లో వస్తున్న ఈ చిత్ర ఆడియోకి ఉండే క్రేజ్ వేరే లెవెల్ అనే చెప్పాలి. సినిమాటోగ్రాఫర్ మిరోస్లోవ్ కుబ బ్రోజెక్ విజువల్స్ అల్లు అర్జున్ అభిమానుల్ని, ప్రేక్షకుల్ని ఆశ్చర్యపరుస్తాయి. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హింది భాషల్లో ఏకకాలంలో అగష్టు13న విడుదల చేయటానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రం తప్పకుండా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్నారు' అని చిత్ర బృందం పేర్కొంది. ఈ చిత్రానికి ప్రొడ్యూసర్స్: నవీన్ ఎర్నేని, రవి శంకర్.వై, కెమెరామెన్: మిరోస్లోవ్ కుబ బ్రోజెక్, మ్యూజిక్: దేవి శ్రీ ప్రసాద్, ఎడిటర్: కార్తిక్ శ్రీనివాస్, ఆర్ట్ డైరెక్టర్: ఎస్.రామకృష్ణ, మౌనిక, రచన - దర్శకత్వం : సుకుమార్.