Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హీరో కార్తి నటించిన చిత్రం 'సుల్తాన్'. రష్మిక మందన్న హీరోయిన్గా నటించిన ఈ చిత్రానికి బక్కియరాజ్ కణ్ణన్ దర్శకుడు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌పై యస్.ఆర్.ప్రకాష్ బాబు, యస్.ఆర్.ప్రభు నిర్మించారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్‌తో మంచి కలెక్షన్స్ సాధిస్తోంది. ఈ సందర్భంగా ఆదివారం ప్రసాద్‌ల్యాబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వరంగల్ శ్రీను మాట్లాడుతూ, 'ఒక మంచి సినిమాని తెలుగు ప్రేక్షకులకి అందించినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్స్, రొమాన్స్, లవ్, కామెడీ, యాక్షన్ ఇలా అన్ని అంశాలు మిళితమై ఉన్నాయి. ఫ్యామిలీ ఆడియెన్స్‌కి కార్తి, రష్మిక కెమిస్ట్రి బాగా నచ్చింది' అని తెలిపారు. 'మా సినిమాకి మంచి రెస్పాన్స్ వస్తున్నందుకు హ్యాపీగా ఉంది' అని నిర్మాత ఎస్.ఆర్.ప్రభు అన్నారు. దర్శకుడు భాగ్యరాజ్ కణ్ణన్ మాట్లాడుతూ, 'నా కథ మీద నమ్మకంతో ఈ అవకాశం ఇచ్చిన ప్రభుగారికి స్పెషల్ థ్యాంక్స్. తమిళం, తెలుగులో సూపర్ రెస్పాన్స్ వస్తోంది' అని చెప్పారు. 'మంచి కంటెంట్‌తో వస్తే ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారని ప్రూవ్ చేశారు. మా మూవీని ఫ్యామిలీస్ బాగా ఎంజారు చేస్తున్నారు. ముఖ్యంగా ఆడవాళ్లకి ఈ సినిమాలో ఫైట్స్ చాలా బాగా నచ్చాయి. ఈ సినిమా తీసిందే చిన్నపిల్లల నుండి పెద్దవారిదాకా అందరూ ఎంజారు చేయాలని. అది నిజమైంది. దర్శకుడు భాగ్యరాజ్ మంచి కాన్సెప్ట్‌తో వందమంది అన్నయ్యల మధ్య నేను ఉంటే ఎలా ఉంటుంది అని చూపించారు. యువన్ శంకర్ రాజా తన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో సినిమాని మరింత ఎలివేట్ చేశాడు. అందరూ ఇంటర్వెల్ బ్లాక్ మరియు క్లైమాక్స్ ఫైట్స్ గురించే మాట్లాడుతున్నారు. నా కెరీర్లో తెలుగులో సుల్తాన్ సినిమాకి బిగ్గెస్ట్ ఓపెనింగ్ వచ్చింది' అని హీరో కార్తి అన్నారు.