Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సందీప్ కిషన్, నేహా శెట్టి జంటగా జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో ఎం.వి.వి.సత్యనారాయణ నిర్మిస్తున్న చిత్రం 'గల్లీరౌడీ'. కోన ఫిల్మ్ కార్పొరేషన్, ఎంవీవీ సినిమా పతాకాలపై కోన వెంకట్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్‌లుక్ లాంచ్ ఆదివారం హైదరాబాద్‌లో జరిగింది. దర్శకులు వి.వి.వినాయక్, నందినీ రెడ్డి ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చేేశారు. ఈ సందర్భంగా సమర్పకుడు కోన వెంకట్ మాట్లాడుతూ,'సందీప్ జడ్జ్మెంట్ చాలా బాగుంటుంది. తను ఈ కథకు హండ్రెడ్ పర్సెంట్ యాప్ట్ అయ్యాడు. పవర్ఫుల్ కథ కావడంతో రాజేంద్ర ప్రసాద్‌తో కలిసి పనిచేసే అదష్టం కలిగింది. ఈ సినిమాకు ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్స్ రామ్ మిర్యాల, సాయికార్తీక్ ఉన్నారు. ఇదొక ఢ లాంటి సినిమా. ఒక వైపు టెన్షన్ ఉంటూ మరో వైపు ఫన్. రెండు పట్టాల్లాగా వెళ్లే సినిమా ఇది' అని చెప్పారు. డైరెక్టర్ వి.వి.వినాయక్ మాట్లాడుతూ, 'కామెడీ తీయడంలో నాగేశ్వర్రెడ్డిది కొత్త పంథా. మంచి మ్యూజిక్ సెన్స్ ఉన్న డైరెక్టర్. ఈ సినిమా బాగా ఆడాలి' అని అన్నారు. నందినీ రెడ్డి మాట్లాడుతూ, 'నాగేశ్వర్ రెడ్డిగారు కరోనా టెన్షన్ నుంచి ఈ సినిమాతో రిలీఫ్ ఇస్తారని భావిస్తున్నాను. రాజేంద్ర ప్రసాద్ ఈ సినిమాలో ఏదో మ్యాజిక్ చేస్తారని అనుకుంటున్నాను. ఆయనతో మే నెల నుంచి ఓ సినిమా చేయబోతున్నాను' అని తెలిపారు. 'ఈ సినిమాలో అందరూ హాయిగా నవ్వుకునే కామెడీ ఉంటుంది. సందీప్‌కి ఇది ట్రైలర్ మేడ్ క్యారెక్టర్ అని చెప్పొచ్చు. నాగేశ్వర్ రెడ్డి మార్కు కామెడీతో సినిమా ఉంటుంది' అని రాజేంద్రప్రసాద్ చెప్పారు. నిర్మాత ఎం.వి.వి.సత్యనారాయణ మాట్లాడుతూ, 'ఈ సినిమా ఇది వరకు నేను, కోన వెంకట్ చేసిన 'గీతాంజలి' కంటే చాలా పెద్ద హిట్ అవుతుందని నమ్ముతున్నాను. అనుకున్న బడ్జెట్లో సినిమాను పూర్తి చేశాం. సినిమా బిజినెస్ కూడా పూర్తయ్యింది' అని అన్నారు. 'నేను కథను వినేటప్పుడు టెక్నీషియన్ కంటే ఆడియెన్‌గానే వింటాను. నా టీమ్ అందరికీ థాంక్స్. సినిమాను అరవై రోజుల్లో పూర్తి చేశాం. యూనిట్ మొత్తం సినిమాని ప్రేమించి చేశాం' అని దర్శకుడు నాగేశ్వర్‌రెడ్డి తెలిపారు. హీరో సందీప్ కిషన్ మాట్లాడుతూ, 'అందరూ నవ్వుకునే సినిమా ఇది. మా తాత రౌడీ.. మా నాన్న రౌడీ. నాకు రౌడీ కావడం ఇష్టముండదు. స్కూల్ నుంచి లాక్కొచ్చి రౌడీని చేస్తారు. రాజేంద్ర ప్రసాద్‌గారు భయస్తుడైన కానిస్టేబుల్ రోల్లో నటించారు. ఆయన్ని చూస్తూ పెరిగాను. ఆయనతో కలిసి పనిచేయడం మెమొరబుల్ ఎక్స్‌పీరియెన్స్. భాను, నందు, సాయిలకు థ్యాంక్స్. చక్కటి కథ కుదిరింది. బాబీ సింహా ఈ సినిమాలో చాలా కీ రోల్లో నటించాడు. సినిమాని థియేటర్లో బాగా ఎంజారు చేస్తారు' అని చెప్పారు. ఎడిటర్ ఛోటా కె.ప్రసాద్, హీరోయిన్ నేహా శెట్టి, మ్యూజిక్ డైరెక్టర్ సాయి కార్తీక్, సినిమాటోగ్రాఫర్ సుజాత సిద్ధార్థ్, రైటర్స్ భాను నందు తదితరులు పాల్గొని చిత్ర విజయాన్ని ఆకాంక్షించారు.