Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విజయ్ సేతుపతి, జయరామ్ హీరోలుగా నటించిన మలయాళ చిత్రం 'మార్కోని మతాయ్'. గుండేపూడి శీను సమర్పణలో లక్ష్మీచెన్నకేశవ ఫిల్మ్స్ అధినేత, నిర్మాత డి.వి. కృష్ణ స్వామి ఈ చిత్రాన్ని 'రేడియో మాధవ్'గా తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ నెల 23న ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా సోమవారం ప్రసాద్ ల్యాబ్స్‌లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో నిర్మాత డి.వి.కృష్ణ ష్వామి మాట్లాడుతూ, 'ఇదొక ఫీల్ గుడ్ లవ్ ఎంటర్టైనర్. సాంగ్స్ చాలా బావున్నాయి. భాషా శ్రీ మాటల్ని అద్భుతంగా రాశారు. డబ్బింగ్ సినిమా అనేలా కాకుండా ప్రేక్షకులకు స్ట్రయిట్ సినిమా చూసిన ఫీలింగ్ కలుగుతుంది. విజయ్ సేతుపతి, జయరామ్ వంటి భారీ తారాగణంతో రూపొందిన ఈ సినిమా కచ్చితంగా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరిస్తుంది' అని చెప్పారు. వీడియో సందేశం ద్వారా జయరామ్ మాట్లాడుతూ, 'తెలుగులో 'తెనాలి', 'పంచతంత్రం' సినిమాల తర్వాత అనుష్క 'భాగమతి', అల్లు అర్జున్ 'అల వైకుంఠపురములో' నటించా. ఇదొక బ్యూటిఫుల్ ఫిల్మ్' అని చెప్పారు. 'ఫీల్ గుడ్ ఎంటర్టైనర్ సినిమాను థియేటర్లలో చూస్తారని ఆశిస్తున్నా' అని ఎగ్జిక్యూటివ్ నిర్మాత ఎన్. శ్రీనివాసమూర్తి తెలిపారు. సమర్పకులు గుండేపూడి శీను మాట్లాడుతూ, 'ప్రేమ అనేది గొప్ప ఫీలింగ్. చాలా స్వచ్ఛమైనది. ప్రేమకు వయోభేదం లేదని చెప్పే చిత్రమిది' అని అన్నారు.సహ నిర్మాత డి.వి.చలం మాట్లాడుతూ, 'మా అబ్బాయి నిర్మాతగా చేస్తున్న చిత్రమిది. చక్కగా డబ్బింగ్ చేయించాడు. తెలుగు సినిమా చూస్తున్నట్టే ఉంటుంది' అని తెలిపారు. భాషా శ్రీ మాట్లాడుతూ, 'విజయ్ సేతుపతి, జయరామ్‌గారి పాత్రలు బావుంటాయి. ప్రేమకు వయసుతో సంబంధం లేదని చక్కగా ఈ సినిమాలో చూపించారు' అని తెలిపారు.