Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సాయితేజ్, దేవ్ కట్ట కాంబినేషన్లో రూపొందుతున్న పొలిటికల్ థ్రిల్లర్ 'రిపబ్లిక్'. జీ స్టూడియోస్ సమర్పణలో జె.బి.ఎంటర్టైన్మెంట్ పతాకంపై ఈ చిత్రాన్ని జె.భగవాన్, జె.పుల్లారావు నిర్మిస్తున్నారు. జూన్ 4న ఈ సినిమా విడుదల కాబోతోంది. ఈ చిత్ర టీజర్‌ను సోమవారం అగ్ర దర్శకుడు సుకుమార్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 'దేవ్ తీసిన ప్రస్థానం' సినిమాలోని సెన్సిబిలిటీస్, నెరేషన్ అంత గొప్పగా ఉంటాయి. ఈ సినిమా కథను దేవ్ నాకు చెబుతానంటే, వద్దని అన్నాను. అందుకు కారణం, ఓ మంచి దర్శకుడి కథను వినడం కంటే చూడాలని నేను అనుకోవడమే. టీజర్ అద్భుతంగా ఉంది. ఇందులోని ఓ షాట్ చాలు. ఈ సినిమా ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నాడో. చాలా ఇన్టెన్స్ ఉంది. సాయితేజ్ సహా యూనిట్‌కి ఆల్ ది బెస్ట్' అని అన్నారు.
డైరెక్టర్ దేవ్ కట్ట మాట్లాడుతూ, 'కథపై నమ్మకం, స్టార్డమ్ అన్నింటిపై నమ్మకం పెంచిన చిత్రం 'రంగస్థలం'. ఆ సినిమా కారణంగానే నేను ఈ సినిమా చేశాను. నేను ఈ స్థానంలో ఉండి మాట్లాడటానికి చాలా కాలం పట్టింది. ఈ సినిమా రిలీజ్ తర్వాత ఎక్కువగా ఈ స్థానంలో ఉండి మాట్లాడతానని అనుకుంటున్నాను' అని చెప్పారు.
'హానెస్ట్ అటెంప్ట్ చేశాం. కచ్చితంగా అందరికీ ఈ సినిమా రీచ్ అవుతుందని, ప్రేక్షకుల హృదయాలను టచ్ చేస్తుందని నమ్ముతున్నాను. మా ప్రొడ్యూసర్స్ భగవాన్, పుల్లారావు ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. మణిశర్మగారు అమేజింగ్ వర్క్ ఇచ్చారు. ఆయనతో ఎప్పటి నుంచో పనిచేయాలని అనుకునేవాడిని. ఈ సినిమాతో ఆ కోరిక తీరింది. సినిమాటోగ్రాఫర్ సుకుమారన్ అద్భుతమైన విజువల్స్ అందించారు. దేవాతో పని చేయడం లవ్లీ ఎక్స్‌పీరియెన్స్. ఫ్యాన్స్ ఇచ్చిన సపోర్ట్‌తోనే ఈ సినిమాని ధైర్యంగా చేయగలిగాను' అని హీరో సాయితేజ్ అన్నారు. 'హీరో సాయితేజ్‌తో తొమ్మిదేళ్లుగా ట్రావెల్ చేస్తున్నాం. ఆ ప్రతిఫలమే ఇది. దర్శకుడు దేవ్‌గారు సినిమా గురించి అహర్నిశలు కష్టపడ్డారు. సుకుమార్ చేతుల మీదుగా మా సినిమా టీజర్ విడుదల అవడం హ్యాపీగా ఉంది. ఈ సినిమా ఇంత గొప్పగా తీయడానికి హీరో సాయితేజ్, డైరెక్టర్,ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ అందరూ సపోర్ట్ చేశారు' అని నిర్మాతలు జె.భగవాన్, జె.పుల్లారావు అన్నారు.