Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పవన్ కళ్యాణ్ తాజాగా నటించిన చిత్రం 'వకీల్ సాబ్'. ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుక వేలాది మంది అభిమానుల కేరింతల మధ్య వైభవంగా జరిగింది. హైదరాబాద్ శిల్పకళా వేదికలో జరిగిన ఈ కార్యక్రమం ఆద్యంతం ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో వివిధ రంగాల్లో రాణిస్తున్న మహిళలను సత్కరించారు. ఉమెన్ సేఫ్టీ వింగ్ డీఐజీ సుమతి, విద్యావేత్త పద్మావతి, తూప్రాన్ రైల్వేగేట్ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులను కాపాడిన సాహస బాలిక రుచిత సత్కారం పొందిన వారిలో ఉన్నారు.
ఈ సందర్భంగా దర్శకుడు శ్రీరామ్ వేణు మాట్లాడుతూ, '42 రోజులు ఈ సినిమా చిత్రీకరణ చేశాం. ప్రతి రోజూ, ప్రతి మీటింగ్, ప్రతి డిస్కర్షన్ పవర్‌స్టార్‌తో సంతోషంగా సాగింది. డబ్బింగ్ పూర్తయ్యాక పవర్‌స్టార్ నా భుజం తట్టారు. పవన్ గారికి రుణపడి ఉంటాను' అని అన్నారు.
నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ, 'పవర్‌స్టార్‌తో సినిమా చేయాలనే నా కల ఈ సినిమాతో నెరవేరింది. మా కల నెరవేరేలా చేసిన హిందీ 'పింక్' మేకర్స్, బోనీ కపూర్, హరీష్ శంకర్, త్రివిక్రమ్.. ఈ నలుగురికీ థ్యాంక్స్. సినిమా అంగీకరించిన తర్వాత పవన్ గారు మాతో ఒకటే ఒక మాటన్నారు. ఇది గొప్ప కథ, ఈ కథలో నా ఇమేజ్‌కి తగ్గట్టు బ్యాలెన్స్ చేస్తే ఒక మ్యాజిక్ అవ్వుద్ది అన్నారు. మీకు ట్రైలర్ లాంచ్ రోజు చెప్పాను. ఇది బ్రేక్ ఫాస్ట్ మాత్రమే అని, లంచ్, డిన్నర్ రిలీజ్ రోజు ఉంటుంది. సినిమాలో ప్రతి పది నిమిషాలకు ఒక హైలైట్ ఉంటుంది. ఏప్రిల్ 9న మనమంతా పండగ చేసుకునే రోజు. కాలర్స్ ఎగరేసే రోజు అది' అని చెప్పారు.
సంగీత దర్శకుడు ఎస్ఎస్ థమన్ మాట్లాడుతూ,'పవన్ కళ్యాణ్ గారితో ఇలాంటి గొప్ప సినిమాకు పనిచేసే అవకాశం ఇచ్చిన దర్శకుడు శ్రీరామ్ వేణు, నిర్మాత దిల్ రాజు గారికి థ్యాంక్స్. 'అయ్యప్పనుమ్ కోషియమ్' రీమేక్‌లో మాస్ పాటలు చేస్తానని మాటిస్తున్నా. మా అమ్మను తీసుకెళ్లి గర్వంగా చూపించే సినిమా ఇది' అని తెలిపారు.
'నిర్మాత దిల్ రాజు, వేణు శ్రీరామ్ లాంటి చక్కటి దర్శకుడి దగ్గర పనిచేసినందుకు అదష్టంగా భావిస్తున్నాను. ఈ సినిమాని మా ఇంట్లో ఆడపడుచులకు, స్త్రీ మూర్తులకు, ఇక్కడున్న వారికి, టీవీల్లో చూస్తున్న మహిళలకు, తల్లులకు, ఆడబిడ్డలకు మా తరుపున ఇస్తున్న గౌరవం. మీ త్యాగాలకు మేము ఇస్తున్న చిన్న రీపే ఈ సినిమా' అని చెప్పారు.