Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే జంటగా రూపొందుతున్న రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్'. అల్లు అరవింద్ సమర్పణలో బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని జీఏ2 పిక్చర్స్ బ్యానర్‌పై బన్నీ వాసు, మరో నిర్మాత, దర్శకుడు వాసువర్మ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలోని 'ఏ జిందగీ..' అంటూ సాగే పాటను చిత్ర బృందం సోమవారం విడుదల చేసింది. 'ఈ పాటను మలయాళీ ఇన్ఫ్లూయెన్సర్ నఫీసా హాన్యా పాడటం ఓ విశేషమైతే, ఓ మలయాళీ ఇన్‌ఫ్లూయెన్సర్‌కు పాట పాడే అవకాశం ఇచ్చిన మొట్టమొదటి బ్యానర్ గీతా ఆర్ట్స్ 2 కావడం మరో విశేషం. విడుదలైన దగ్గర్నుంచి 'ఏ జిందగీ..' పాటకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది. ఈ సినిమాని జూన్ 19న విడుదల చేసేందుకు దర్శక, నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ తన చిత్రాల్లోని పాత్రల్ని చాలా క్యూట్ రొమాన్స్‌తో, లవ్లీగా ఉండేలా డిజైన్ చేస్తారు. ఇప్పుడు ఈ సినిమాలో కూడా అఖిల్ అక్కినేని, పూజా మధ్య కూడా అలాంటి మంచి కెమిస్ట్రీ ఉండేలా డిజైన్ చేశారు. ఆయన మార్క్ మేకింగ్ సిల్వర్‌స్క్రీన్ మీద వావ్ అనేలా ఉంటుంది. అలాగే ఇప్పటివరకు ఈ చిత్రానికి సంబంధించి విడుదలైన కంటెంట్‌తో సినిమాపై అంచనాలు పెరిగాయి' అని చిత్ర యూనిట్ పేర్కొంది. ఆమని, మురళి శర్మ, జయ ప్రకాశ్, ప్రగతి, సుడిగాలి సుధీర్, గెటెప్ శ్రీను, అభరు, అమిత్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సమర్పణ : అల్లు అరవింద్, మ్యూజిక్ : గోపీ సుందర్, సినిమాటోగ్రఫీ : ప్రదీశ్ ఎమ్ వర్మ, ఎడిటర్ : మార్తండ్ కె. వెంకటేశ్, ఆర్ట్ డైరెక్టర్ : అవినాష్ కొల్లా, ఎక్క్యూటివ్ ప్రొడ్యూసర్ : సత్య గమిడి, నిర్మాతలు : బన్నీ వాసు, వాసు వర్మ , దర్శకుడు : బొమ్మరిల్లు భాస్కర్.