Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విక్కీ, నూరజ్, కీయా, లోహిత నటీనటులుగా రూపొందుతున్న చిత్రం 'మిస్టర్ లోన్లీ'.'వీడి చుట్టూ అమ్మాయిలే' అనేది ట్యాగ్ లైన్. ముక్కి హరీష్ కుమార్ దర్శకుడు. శ్రీమతి దుర్గావతి సమర్పణలో యస్.కె.యం.యల్ మోషన్ పిక్చర్స్ పతాకంపై కండ్రేగుల ఆదినారాయణ నిర్మిస్తున్నారు. ఈ చిత్ర ట్రైలర్‌ను మంగళవారం ఫిల్మ్ ఛాంబర్లో పాత్రికేయుల సమక్షంలో రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు ముక్కి హరీష్ కుమార్ మాట్లాడుతూ,'ముగ్గురు అమ్మాయిల మధ్య ఒక అబ్బాయి ఏ విధంగా మోసపోయాడు?, ఆ తరువాత ఆ అబ్బాయి లైఫ్ ఏమైంది అనేదే చిత్ర కథాంశం. సంగీత దర్శకుడు నిజాని అంజాన్ అద్భుతమైన పాటలు అందించారు. డి.ఓ.పి, ఎడిటర్ ఇలా.. అందరూ నాకు ఫుల్ సపోర్ట్ ఇచ్చారు.ఈ సినిమా ప్రేక్షకులందరికీ తప్పకుండా నచ్చుతుంది' అని అన్నారు 'నిర్మాతగా నాకు ఇది 5వ సినిమా. ఇప్పటివరకు 94 సినిమాలను డిస్ట్రిబ్యూషన్ చేశా. ఈ సినిమా మూడు స్టేజెస్‌లో జరిగే లవ్ స్టొరీ. స్కూల్ ఏజ్ , కాలేజ్ ఏజ్, కాలేజ్ తరువాత ఇలా మూడు ఏజెస్‌లో ఈ సినిమా కథ నడుస్తుంది. 'అర్జున్ రెడ్డి,' 'ఆర్ ఎక్స్ 100'ను మాదిరిగానే ఈ సినిమా విడుదల తరువాత యూత్ అంతా మా సినిమా గురించే డిస్కస్ చేస్తారు' అని నిర్మాత కండ్రేగుల ఆదినారాయణ చెప్పారు. హీరో విక్కీ మాట్లాడుతూ, 'ఇది నా మొదటి చిత్రం. మంచి మెసేజ్ ఉన్న ఈ చిత్రంలో నటించే అవకాశం కల్పించిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు' అని తెలిపారు.
'చిత్రీకరణ సమయంలో టీమ్ మొత్తం నాకు ఫుల్ సపోర్ట్ ఇచ్చారు. ఓ మంచి సినిమాలో భాగమైనందుకు సంతోషంగా ఉంది' అని హీరోయిన్ కీయా చెప్పారు. ఎడిటర్ సాయిరాం మాట్లాడుతూ, 'ఈ సినిమా చాలా బాగా వచ్చింది. యూత్‌కి ఈ సినిమా బాగా కనెక్ట్ అవుతుంది' అని తెలిపారు. డి.ఓ.పి.ఆనంద్ గార మాట్లాడుతూ, '64 బ్యూటీఫుల్ లొకేషన్స్‌ల్లో 34 రోజుల్లో ఈ సినిమాని తీశాం.అందరినీ అలరించే సినిమా ఇది' అని చెప్పారు.