Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సంపూర్ణేష్‌బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రానికి 'పుడింగి నెంబర్ 1' అనే టైటిల్ నిర్ణయించారు. ఈ సినిమాతో మీరావలి దర్శకుడిగా పరిచయం అవుతుండగా, విద్యుత్లేఖ రామన్, సాఫీ కౌర్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఈ సినిమా ప్రారంభోత్సవం బుధవారం రామానాయుడు స్టూడియోస్‌లో పూజా కార్యక్రమాలతో ఘనంగా జరిగింది. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత కె.ఎస్.రామారావు క్లాప్ కొట్టగా, దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు కెమెరా స్విచాన్ చేశారు. ఈ రోజు నుండి ఈ మూవీ రెగ్యులర్ చిత్రీకరణ ప్రారంభంకానుంది. ఈ సందర్భంగా దర్శకుడు మీరావలి మాట్లాడుతూ, 'కథ అద్భుతంగా వచ్చింది. 'పుడింగి నెం 1' టైటిల్‌కి, కథకి సంపూర్ణేష్ బాబు పక్కా యాప్ట్' అని చెప్పారు. చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ, 'నేటి నుంచే రెగ్యులర్ చిత్రీకరణను ఆరంభిస్తున్నాం. ఈ నెలలో 17 రోజుల పాటు చిత్రీకరణ ప్లాన్ చేశాం. మిగిలిన చిత్రీకరణను మే నెలలో పూర్తి చేస్తాం. జూలైలో సినిమా రిలీజ్ చేస్తాం' అని తెలిపారు. హీరోయిన్ విద్యుత్లేఖ రామన్ మాట్లాడుతూ,'హీరోయిన్ కావాలన్న నా కల ఈ సినిమాతో నెరవేరింది' అని చెప్పారు. తెలుగులో తనకి ఇది తొలి సినిమా అని హీరోయిన్ సాఫీకౌర్ తెలిపారు. సంపూర్ణేష్‌బాబు మాట్లాడుతూ, ' దర్శకుడు మీరావలిలో మంచి కసి ఉంది. నాలాంటి ఒక చిన్న నటుడిని ఆశీర్వదించడానికి వచ్చిన నిర్మాత కేఎస్‌రామారావు, దర్శకులు భీమనేని శ్రీనివాసరావుగారికి ధన్యవాదాలు. ఇదొక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్' అని అన్నారు.