Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'మల్లేశం' చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన నాయిక అనన్య నాగళ్ల. పవన్‌కళ్యాణ్ నటించిన 'వకీల్ సాబ్' చిత్రంలో ఓ ముఖ్య పాత్ర పోషించింది. ఏప్రిల్ 9న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తోంది.
ఈ సందర్భంగా మంగళవారం అనన్య నాగళ్ల మీడియాతో షేర్ చేసుకున్న విశేషాలు..
అప్పుడు సర్ప్రైజ్ అయ్యా..
'మల్లేశం' సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ అయ్యాక, దర్శకుడు శ్రీరామ్ వేణు ఆ సినిమా చూసి ఇందులో ఓ క్యారెక్టర్ కోసం పిలిచారు. మూడు రౌండ్స్ ఆడిషన్ చేశాక సెలెక్ట్ చేశారు. అయితే ఇది కళ్యాణ్‌గారి సినిమా అని నాకు ముందు తెలియదు. తెలిశాక సర్ప్రైజ్ అయ్యాను.
సింపతి చూపిస్తారు
ఈ సినిమాలో నా పాత్ర చాలా ఇన్నోసెంట్‌గా ఉంటుంది. తన పనేదో తన చూసుకునే అమ్మాయిలా కనిపిస్తాను. నేను చేసిన క్యారెక్టర్ మన జీవితంలో తరుచుగా చూస్తుంటాం.
ఇలాంటి ఒక అమ్మాయికి
సమస్య వస్తే, అయ్యో తనకు ఇలా జరిగిందా అని ప్రేక్షకులు సింపతీ చూపిస్తారు.
మాలాంటి వారికి నమ్మకం ఇచ్చింది
తెలుగు అమ్మాయిలకు తెలుగులో అవకాశాలు రావు, ముందు తమిళం లాంటి లాంగ్వేజ్‌లో చేసి, తర్వాత ఇక్కడికి వస్తే గౌరవం ఉంటుందని మాలాంటి కొత్త హీరోయిన్స్ మధ్య డిస్కర్షన్స్ జరుగుతుంటాయి. కానీ 'వకీల్ సాబ్' తెలుగు అమ్మాయిలకు ఒక నమ్మకాన్ని ఇచ్చింది.
పవన్ మాటలు స్ఫూర్తిదాయకం
పవన్ గారితో సెట్లో గడిపిన సమయం మర్చి పోలేను. ఆయన చెప్పే విషయాలు ఇన్స్పైరింగ్గా ఉండేవి. వకీల్ సాబ్ చిత్రీకరణ జరుగుతున్నప్పుడే ఏపీలో ఒక అమ్మాయి మీద అఘాయిత్యం జరిగితే, ఆ విషయం గురించి పవన్ నాతో మాట్లాడారు. 'దిశ' ఇన్సిడెంట్ లాంటివి అమ్మాయిల మీద జరిగినప్పుడు, వాటి మీద పోరాటం చేసేందుకు నేనేమీ చేయలేను, నాకేమీ శక్తి లేదు అనుకోవద్దు, నీ ప్రార్థనను యూనివర్స్‌కు పంపించు. అది కూడా ప్రభావం చూపిస్తుందని చెప్పేవారు.
ఆ ఒక్క ప్రశంస చాలు..
ఇందులో కోర్ట్ సీన్ చేసేప్పుడు పవర్ స్టార్ కాంబినేషన్లో నటించాను. అప్పుడు నా నటన చూసి, మీ యాక్టింగ్‌లో ఎమోషన్ బాగా ఉంది. సీన్ రిపీట్ చేసినా అదే ఎమోషన్లో ఉంటున్నారు అని కాంప్లిమెంట్ ఇచ్చారు. ఆ ప్రశంసకు చాలా హ్యాపీగా ఫీలయ్యాను. నివేదా, అంజలితో పోల్చుకుంటే నాకు అనుభవం తక్కువ. కాబట్టి వారితో ఎప్పుడూ నటనలో పోటీ పడాలని అనుకోలేదు.
సమాజంపై మార్పు చూపుతుంది
'వకీల్ సాబ్' సమాజం మీద ప్రభావం చూపించే సినిమా. ఖచ్చితంగా ఈ సినిమా ఒక మార్పు తెస్తుంది. అమ్మాయిలనే కాదు అబ్బాయిలను కూడా సరైన విధంగా పెంచాలని చెబుతుందీ సినిమా.
సరైన దారిలోనే ఉంది
'మల్లేశం', 'ప్లే బ్యాక్' చిత్రాల తర్వాత నా కెరీర్ సరైన దారిలో వెళ్తుందని అనుకుంటున్నా.
'వకీల్ సాబ్' లాంటి చిత్రాలను నేను ఎంపిక చేసుకోలేను, అవే నన్ను ఎంపిక చేసుకున్నాయి. చేసే సినిమాలో నాదైన ఏదో ఒక ప్రత్యేకత ఉండాలని ఆశిస్తా. ప్రస్తుతం బబ్లీ క్యారెక్టర్స్, ఆ తర్వాత నటనకి స్కోప్ ఉన్న పాత్రలను సెలెక్ట్ చేసుకుంటాను. ప్రస్తుతం రెండు చిత్రాలు చేస్తున్నాను.