Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాజేంద్రప్రసాద్ ప్రధానపాత్రలో శ్రీ సుమన్ వేంకటాద్రి ప్రొడక్షన్స్ బ్యానర్ పై సుమన్ బాబు, కారుణ్య చౌదరి జంటగా శ్రీరామ్, కమల్ కామరాజు కీలక పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం 'ఎర్రచీర'.
తాజాగా ఈ సినిమాలోని 'తొలి తొలి ముద్దు...' అనే సాంగ్‌ని దర్శకుడు మారుతి రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 'ఈ 'తొలి తొలి ముద్దు..' సాంగ్ చాలా బాగుంది. మంచి విజువల్ ట్రీట్‌గా ఈ పాట ఉంది. తప్పకుండా ఈ సినిమా మంచి విజయం సాధించి, సుమన్‌కి మంచి పేరు తీసుకురావాలి' అని తెలిపారు. సుమన్ బాబు మాట్లాడుతూ, 'సినిమాలో ఈ సాంగ్ చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ప్రమోద్ పులిగిల్ల సంగీతం అందించగా, అంజనా సౌమ్య, హేమచంద్ర ఆలపించారు. ముఖ్యంగా మంచి మ్యూజిక్, లిరిక్స్ కుదిరాయి. అలాగే లేటెస్ట్గా విడుదలైన టీజర్‌తో సినిమా పై భారీ అంచనాలు పెరిగాయి. ఆ అంచనాలను మరింత పెంచేలా ఈ సాంగ్ అందరినీ అలరిస్తుంది. దీంతోపాటు ఈ సాంగ్‌ని ఎలాంటి కాపీ రైట్ లేకుండా అందరూ ఉపయోగించుకునేలా ఏర్పాటు చేశాం. ఈ సినిమాలో రాజేంద్రప్రసాద్ గారి పాత్ర హైలెట్‌గా నిలుస్తుంది. అన్ని కార్యక్రమాలు దాదాపు తుది దశలో ఉన్నాయి. త్వరలోనే చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం' అని చెప్పారు.