Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శ్రీ తుల్జా భవాని గ్రూప్స్ మూవీ మేకర్స్ పతాకం పై కె. రవి కుమార్ రాణా, నేహా శ్రీ జంటగా రూపొందుతున్న చిత్రం 'సంహారి'. లక్ష్మి కేతావత్, రేణుక కేతావత్ సమర్పణలో కె.రవి కుమార్ రాణా స్వీయదర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్ర ఆడియో విడుదల బుధవారం ఘనంగా జరిగింది. లయన్ సాయి వెంకట్, నాయి కోటి రాజు, గురు చరణ్, 'బైలాంపుడి' నిర్మాత బ్రహ్మానంద రెడ్డి ముఖ్య అతిథులుగా విచ్చేసి ఈ చిత్ర ఆడియోను రిలీజ్ చేసారు.
ఈ సందర్భంగా లయన్ సాయి వెంకట్ మాట్లాడుతూ, 'ఈ సినిమా ట్రైలర్, పాటలు చాలా బాగున్నాయి. మ్యూజికల్‌గా మంచి హిట్ అవుతుందనే నమ్మకం నాకుంది. హీరో, దర్శకుడు, నిర్మాత రవి కుమార్ రాణా ఎంతో ప్యాషన్‌తో ఈ చిత్రాన్ని నిర్మించారు' అని చెప్పారు. 'ఈ సినిమాలో నాలుగు పాటలు ఉన్నాయి. అని పాటలు చాలా మంచిగా కుదిరాయి. అలాగే విజువల్‌గా చిత్రీకరణ కూడా చాలా బాగుంది. సినిమా చాలా గొప్పగా ఉంటుంది. కొత్త కథ అందరికి నచ్చుతుంది' అని సంగీత దర్శకుడు రాజ్ కిరణ్ అన్నారు. హీరో, నిర్మాత, దర్శకుడు రవి కుమార్ మాట్లాడుతూ, 'మ్యూజిక్ డైరెక్టర్ రాజ్ కిరణ్ మా చిత్రానికి ప్రాణం పోశారు. చిన్నప్పటి నుంచి నాకు సినిమాలు అంటే పిచ్చి. ఎలాగైనా సినిమాలో నటించాలి అని కోరిక ఉండేది. అది ఈ సినిమాతో తీరింది. ఇదొక డిఫరెంట్ థ్రిల్లర్ సినిమా. త్వరలోనే విడుదల చేస్తాం' అని తెలిపారు. నాయి కోటి రాజు మాట్లాడుతూ, 'హీరో రవి ఫస్ట్ టైం సినిమా చేసినప్పటికీ అద్భుతంగా నటించాడు. పాటలు విన్నా. చాలా బాగున్నాయి. సినిమా మంచి విజయం సాధించాలి' అని చెప్పారు.