Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భార్యాభర్తల మధ్య రిలేషన్ ఎలా ఉండాలి?, ఎలా ఉండకూడదనే కథాశంతో ఫీల్ గుడ్ లవ్ స్టోరీగా తెరకెక్కిన చిత్రం 'చెరసాల'. ఎస్.రారు క్రియేషన్స్ పతాకంపై శ్రీజిత్, రామ్ ప్రకాష్ గుణ్ణం, నిష్కల, శిల్పా దాస్ హీరో, హీరోయిన్లుగా నటించారు. రామ్ ప్రకాష్ గుణ్ణం దర్శకుడు. మద్దినేని సురేష్, సుధా రాయ్ నిర్మాతలు. ఈ చిత్ర టీజర్‌ను దర్శకులు ఎస్వీ కృష్ణారెడ్డి రిలీజ్ చేయగా, ఫిల్మ్ ఛాంబర్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్న కుమార్ ట్రైలర్‌ను విడుదల చేశారు. నిర్మాత ఆచంట గోపీనాథ్, బసి రెడ్డి ఈ చిత్రంలోని పాటలను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఎస్.వి.కృష్ణారెడ్డి మాట్లాడుతూ, 'కెమెరామెన్ దర్శకుడిగా మారి ఈ చిత్రాన్ని చాలా చక్కగా తెరకెక్కించాడు. సినిమా మేకింగ్ చాలా బాగుంది. సినిమా చాలా బాగుంది' అని చెప్పారు. చిత్ర దర్శకుడు రామ్ ప్రకాష్ గుణ్ణం మాట్లాడుతూ,'ఈ సినిమాకి సినిమాటోగ్రాఫర్‌గా చేస్తూ, దర్శకుడిగా, నటుడిగా కూడా చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ప్రస్తుతం ఉన్న ట్రెండ్‌కి అద్దం పట్టేలా ఈ సినిమా ఉంటుంది. ముఖ్యంగా భార్యాభర్తల రిలేషన్‌ని బాగా హైలెట్ చేశాం. అలాగే కథానుగుణంగా సాగే కామెడీ అందరికీ వినోదాన్ని పంచుతుంది' అని చెప్పారు. చిత్ర నిర్మాత సుధారాయ్ మాట్లాడుతూ,' బ్యూటీఫుల్ లొకేషన్లలోతీసిన ఈ సినిమా మేం అనుకున్న దానికంటే చాలా చక్కగా వచ్చింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని, త్వరలో మీ ముందుకు వస్తున్న మా సినిమాని ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటున్నాను' అని తెలిపారు.