Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తమన్నా ప్రధాన పాత్రధారిణిగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రూపొందిన తెలుగు వెబ్ సిరీస్ 'లెవెన్త్ అవర్'. ప్రదీప్ ఉప్పలపాటి నిర్మించిన ఈ వెబ్ సిరీస్ ఉగాది కానుకగా ఈనెల 9న 'ఆహా'లో ప్రసారం కానుంది. ఈ సందర్భంగా ఈ వెబ్ సిరీస్ ట్రైలర్‌ను మంగళవారం విడుదల చేశారు. ఉమెన్ ఎంటర్ ప్రెన్యూరర్స్కు సలహాలతో పాటు, ఆర్థిక సాయం అందించడానికి ఆహాతో వి హబ్ తోడైంది. ఈ కార్యక్రమంలో షార్టిజీ ఫౌండర్, ఎంటర్ ప్రెన్యూరర్ సురభికి ఆహా, వి హబ్ కలిసి ఐదు లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించారు.
ఈ సందర్భంగా నిర్మాత ప్రదీప్ ఉప్పలపాటి మాట్లాడుతూ, ''8అవర్స్' అనే పుస్తకాన్ని ఆధారంగా చేసుకుని ఈ 'లెవెన్త్ అవర్' కథను తయారు చేశాను. అరత్రికా అనే అమ్మాయి తనకు ఎదురైన సమస్యలను ఎలా ఎదుర్కొందనేదే ఈ కథ. సంక్లిష్లమైన ఈ ప్రపంచంలో ఓ రాత్రిలో అరత్రికా ఎలాంటి సమస్యను ఎదుర్కొని, సక్సెస్ అయ్యిందో తెలియాలంటే ఈ సిరీస్ చూడాల్సిందే. ఆమె ఎలా సక్సెస్ అయ్యిందనేది చాలా ఆసక్తి కరంగా ఉంటుంది. ఈ జర్నీలో మాకు 'ఆహా' తోడ్పాటు మరచిపోలేనిది. ప్రవీణ్ సత్తారు సపోర్ట్‌తో మంచి అవుట్ తీసుకురాగలిగాం' అని అన్నారు.
డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు మాట్లాడుతూ, 'మగవాళ్ళు మల్టీ టాలెంటెడ్ కారు. కానీ మహిళలు మాత్రం మల్టీ టాలెంటెడ్. వారు పది పనులైనా చేయగలరు. అలాంటి మహిళల గురించి చెప్పాల్సిన సందర్భాల్లో చాలా విషయాల గురించి మాట్లాడుకోవచ్చు. అదే మేం ఈ వెబ్ సిరీస్‌లో చెప్పాం.
అరత్రికా రెడ్డి అనే అమ్మాయి ఈ సిరీస్‌లో ప్రారంభం నుంచే స్ట్రాంగ్ ఉమెన్ కాదు. సమస్యను ఎదుర్కొనే క్రమంలో ఆమె బలవంతురాలిగా మారుతుంది. ఆమె ఈ కథలో హీరో. ఆమె బలాలే కాదు.. బలహీనతలను గురించి కూడా వెబ్ సిరీస్‌లో చూపించాం. ముఖేష్ అద్భుతమైన విజువల్స్ అందించాడు. నిర్మాత ప్రదీప్ రాసిన స్క్రిప్ట్ చదవగానే బాగా నచ్చేసింది. 33 రోటజుల్లో చిత్రీకరణ పూర్తి చేశాం. యాక్టర్స్, టెక్నికల్ టీమ్ సపోర్ట్‌తో మంచి అవుట్‌ఫుట్ వచ్చింది. తమన్నా ఏదో కొత్తగా చేయాలని ఆతత పడుతుంటుంది. అలాగే అరుణ్, మహతి పాత్రలు చాలా వైవిధ్యంగా ఉంటాయి. అన్ని పాత్రలు సపోర్ట్ చేయడంతో అరత్రికా పాత్రకు మరింత బలం చేకూరింది' అని అన్నారు.
'ఆహా' సీఈఓ అజిత్ ఠాగూర్ మాట్లాడుతూ, 'గత ఏడాది ఫిబ్రవరిలో ఆహాను స్టార్ట్ చేశాం. ఏడాది సమయంలో ప్రేక్షకులు మమ్మల్ని ఎంతో ఆదరించారు. 31 మిలియన్స్ యాక్టివ్ యూనిక్ యూజర్స్ చేరుకున్నాం. 1.2 మిలియన్ సబ్ స్క్రైబర్స్, తెలుగులో అతి వేగంగా ఆదరణ పొందుతున్న ఓటీటీగా ఆహా ఆదరణ పొందుతుంది. లెవెన్త్ అవర్ మహిళా శక్తిని తెలియజేసే వెబ్ సిరీస్. భవిష్యత్‌లో ఇలాంటి కాన్సెప్ట్‌లను మరిన్నింటినీ ప్రేక్షకులకు అందిస్తాం. ఇదే సందర్భంలో ఆహాతో, వి హబ్ కొలాబ్రేట్ అవుతుందని తెలియజేయడానికి సంతోషిస్తున్నాం. ఏడాది సమయంలో ఆరేడు మహిళా ఎంటర్ ప్రెన్యూర్స్‌కు సపోర్ట్ చేస్తాం. ఆర్థికంగా కూడా వారికి మా సపోర్ట్ అందిస్తాం' అని తెలిపారు.