Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'చందమామ కథలు', 'గుంటూరు టాకీస్', 'పిఎస్వి గరుడవేగ' వంటి భిన్న హిట్ చిత్రాలతో డైరెక్టర్‌గా ప్రవీణ్ సత్తారు తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన తెరకెక్కించిన వెబ్ సిరీస్ 'లెవెన్త్ అవర్'. తమన్నా టైటిల్ పాత్రలో నటించిన ఈ వెబ్ సిరీస్ తెలుగు ఓటీటీ మాధ్యమం 'ఆహా'లో ఉగాది సందర్భంగా నేటి (శుక్రవారం) నుంచి ప్రసారం కానుంది.
ఈ సందర్భగా మీడియాతో దర్శకుడు ప్రవీణ్ సత్తారు మాట్లాడుతూ, ''ఆహా' కోసం అల్లు అరవింద్‌గారు ఈ స్టోరీని ఎంపిక చేశారు. ఈ స్క్రిప్ట్ చదివి బాగుందన్నాను. అన్నీ చక్కగా ఉండటంతో వెబ్ సిరీస్ చేశాను. ఇలాంటి జోనర్లో ఇప్పటి వరకు నేను డైరెక్ట్ చేయలేదు. ఓ రోజు రాత్రి జరిగే కథ. ఓ హౌటల్లో రాత్రి పదకొండు గంటల నుంచి పొద్దున ఎనిమిది గంటల వరకు జరిగే కథ. ఈ ఎనిమిది గంటల్లో కథలో ప్రధాన పాత్రధారి అరత్రికా రెడ్డి(తమన్నా) బ్యాంకుకి పదివేల కోట్ల రూపాయలను చెల్లించాలి. అలా చెల్లించకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. అలాంటప్పుడు ఆమె కట్టాల్సిన డబ్బుని కట్టిందా, లేదా అనేదే కథ. తెలుగు వెబ్ సిరీస్‌ల్లో 'లెవెన్త్ అవర్'కు ఓ స్టాండర్డ్ ఉంది. కాస్టింగ్, విజువల్స్ పరంగా వెబ్ సిరీస్ చాలా రిచ్‌గా ఉంటుంది. '8 అవర్స్' అనే బుక్ ఆధారంగా రైటర్ ప్రదీప్ ఈ కథ రాశారు. ఆయనే దీనికి నిర్మాత కూడా. ఇదొక థ్రిలర్. అరత్రికా రెడ్డి పాత్రలో తమన్నా అద్భతంగా ఒదిగిపోయారు. నటనకు చాలా స్కోప్ ఉండే పాత్ర. ఒక వైపు డైలాగ్స్, మరో వైపు ఎమోషన్స్‌తో పాత్రను క్యారీ చేయటంలో తమన్నా ఫెంటాస్టిక్‌గా చేశారు. సెన్సార్ పరిధి దాటి ఏ సన్నివేశాన్ని పెట్టలేదు' అని చెప్పారు.