Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రామ్ గోపాల్ వర్మ తాజాగా 'దెయ్యం' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. రాజశేఖర్, స్వాతి దీక్షిత్, తనికెళ్ల భరణి, అనితా చౌదరి, జీవ, బెనర్జీ తదితరులు నటిస్తున్న ఈ చిత్రం అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ నెల 16న తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదలకు సిద్ధమైంది. రాంగోపాల్ వర్మ పుట్టినరోజు నేపథ్యంలో ఈ చిత్ర ట్రైలర్‌ను రిలీజ్ అయ్యింది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ,'రాంగోపాల్ వర్మ తీసిన ఈ సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. ఇటీవల విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్‌కు అనూహ్య రెస్పాన్స్ వచ్చింది. ట్రైలర్ చూస్తుంటే రాజశేఖర్ కూతురి పాత్రలో నటించిన స్వాతి దీక్షిత్‌కు యాక్షన్ సన్నివేశాలు బాగున్నాయి. అలాగే రాజశేఖర్ తన పాత్ర కోసం మేకప్ లేకుండా, రియల్‌గా నటిస్తుండటం విశేషం. ఈ చిత్రం అందరికీ నచ్చడంతో పాటు సినిమాని చూసిన ప్రేక్షకులందరూ తప్పకుండా ఎంజాయ్ చేస్తారు' అని తెలిపారు.