Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అఖిల్ అక్కినేని, సురేందర్ రెడ్డి కాంబినేషన్లో ఓ సినిమా రూపొందుతున్న విషయం విదితమే. శుక్రవారం అఖిల్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమాకి 'ఏజెంట్' అనే టైటిల్‌ని ఖరారు చేయడంతో పాటు అఖిల్ లుక్‌ని చిత్ర బందం రిలీజ్ చేసింది. అఖిల్ లుక్ చూస్తుంటే సురేందర్ రెడ్డి స్పై యాక్షన్ థ్రిల్లర్ కథాంశాన్ని సిద్దం చేసినట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు లవ్, ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ చేసిన అఖిల్ మొదటిసారి యాక్షన్ థ్రిల్లర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారని అర్థమవుతోంది. ఈ సినిమాని ఎకె ఎంటర్టైన్మెంట్స్ సురేందర్ 2 సినిమా బ్యానర్స్‌పై నిర్మిస్తున్నారు. వక్కంతం వంశీ కథ అందిస్తుండగా, సాక్షి వైద్య హీరోయిన్గా నటిస్తోంది. తమన్ సంగీతమందిస్తున్నాడు. ఈ నెల 11 నుండి ఈ సినిమా చిత్రీకరణని ఆరంభిస్తామని, 2021 డిసెంబర్ 24న ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు.