Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం 'లవ్ స్టోరి'. దర్శకుడు శేఖర్ కమ్ముల రూపొందించిన ఈ చిత్రం ఈనెల 16న ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. అయితే ఇప్పుడున్న కొవిడ్ కేసుల పెరుగుదల నేపథ్యంలో ఈ సినిమా విడుదలను వాయిదా వేస్తున్నట్లు చిత్ర బందం గురువారం విలేకరుల సమావేశంలో తెలిపింది.
ఈ సందర్భంగా నిర్మాత నారాయణ్ దాస్ నారంగ్ మాట్లాడుతూ, 'మా చిత్రాన్ని ఈనెల 16న విడుదల చేసేందుకు చాలా సంతోషంగా ఎదురుచూశాం. అయితే కొవిడ్ కేసులు బాగా పెరుగుతున్నందు వల్ల, ఇప్పుడున్న పరిస్థితులను బట్టి సినిమాని వాయిదా వేయాలని నిర్ణయించాం. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా, మంచి డేట్ చూసి సినిమాని మీ ముందుకు తీసుకొస్తాం' అని తెలిపారు. దర్శకుడు శేఖర్ కమ్ముల మాట్లాడుతూ, 'ఈ సినిమా వర్క్ మొత్తం కంప్లీట్ అయ్యింది. సినిమా చాలా బాగా వచ్చింది. థియేటర్లో సినిమాని ఎప్పుడు చూద్దామా అని వేచి చూశాం. పాండమిక్ తర్వాత వన్ ఇయర్ వేచి చూసి, సినిమా విడుదలకు సిద్ధమయ్యాం. రెండు మూడు రోజుల నుంచి కోవిడ్ పరిస్థితి గమనిస్తున్నాం. మేం అనుకున్న 16వ తేదీకి ఈ కేసుల సంఖ్య ఇంకా పెరిగేలా ఉంది. ఇది అందరూ హ్యాపీగా చూడాల్సిన సినిమా. కోవిడ్ వల్ల వాళ్లంతా థియేటర్లకు రాకపోవచ్చు. డిస్ట్రిబ్యూటర్స్ అందరితో మాట్లాడాం. సినిమా రెడీగా ఉంది. వీలైనంత త్వరగా చిత్రాన్ని విడుదల చేస్తాం. మ్యూజికల్‌గా ఈ సినిమా ఇప్పటికే సూపర్ హిట్ అయ్యింది. అంతటా పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి. రిలీజ్‌కి రైట్ టైమ్ కోసం చూస్తున్నాం' అని అన్నారు.
'పది రోజుల క్రితం శేఖర్ గారు నాకు సినిమా చూపించారు. సినిమా చూసి చాలా ఎగ్జైట్ అయ్యాను. నాకు ఇంత మంచి సినిమా ఇచ్చారు, 16వ తేదీ ఎప్పుడు రాబోతుంది?, ఆడియెన్స్ రియాక్షన్ ఎలా ఉంటుందనే మైండ్ సెట్లో ఉన్నాను. దురదష్టవశాత్తూ గత పది రోజుల్లో పరిస్థితి మారిపోయింది. కరోనా అనేది బాగా వ్యాపిస్తూ ఉంది. కాబట్టి అందరం కలిసి ఒక నిర్ణయానికి వచ్చాం. ఇలాంటి పరిస్థితిలో సినిమాని విడుదల చేయడం కరెక్ట్ కాదనుకున్నాం. నా సినిమాలు, శేఖర్ గారి సినిమాలను ఫ్యామిలీ ఆడియెన్స్ చూసి, సక్సెస్ ఇచ్చారు. ఇలాంటి టైమ్‌లో ఫ్యామిలీస్ వచ్చి సినిమాని చూస్తాయని ఆశించడం తప్పు. ఆరోగ్యం అనేది ముఖ్యం. పరిస్థితులు బాగుపడ్డాక మంచి డేట్ చూసి మీ ముందుకొస్తాం' అని హీరో నాగ చైతన్య చెప్పారు. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్ పీ, అమిగోస్ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. కె నారాయణదాస్ నారంగ్, పి. రామ్మోహన్రావు నిర్మాతలు.