Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో మైత్రి మూవీ మేకర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న పాన్ ఇండియన్ చిత్రం 'పుష్ప'. అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాలోని పుష్ప రాజ్ పాత్రను పరిచయం చేసే వేడుక జెఆర్సీ కన్వెన్షన్ హాల్లో అభిమానుల సమక్షంలో బుధవారం వైభవంగా జరిగింది. ఈ వేడుకకు అల్లు అర్జున్, సుకుమార్‌తో పాటు చిత్ర నిర్మాతలు నవీన్ ఎర్నేని, రవి శంకర్, అల్లు శిరీష్, దర్శకుడు బుచ్చిబాబు సాన పాల్గొన్నారు.ఈ సందర్భంగా అల్లు శిరీష్ మాట్లాడుతూ,'ఒక ఫ్యాన్‌గా చాలా సూపర్‌గా అనిపించింది. ఈ స్టేజీపైకి వచ్చి సినిమా గురించి మాట్లాడాలంటే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తమ్ముడిగా మాత్రమే అర్హత ఉంది' అని తెలిపారు.
అల్లు అర్జున్ మాట్లాడుతూ, 'సుకుమార్ గారూ నాకేం ఇచ్చినా మరిచిపోకుండా ఇస్తారు. 'ఆర్య' సినిమాతోనే నాకు స్టయిలిష్ స్టార్ బిరుదు వచ్చింది. ఆ సినిమాతోనే నా కెరీర్ ఫ్లై అయింది. ఇప్పుడు మళ్లీ నా కెరీర్లో మరచిపోలేని గిఫ్ట్ 'పుష్ప' రూపంలో ఇస్తున్నారు. నువ్వు స్టయిలిష్ స్టార్ కాదు, ఐకాన్ స్టార్ అంటూ బిరుదు ఇచ్చారు. నాకెప్పుడు గుర్తుండి పోతుంది. ఇక ఈ సినిమా గురించి ఏం చెప్పాలి.. తగ్గేదేలే. ఇది కేవలం సినిమా డైలాగ్ మాత్రమే కాదు. నా జీవితంలో కూడా ఎన్నోసార్లు పడిపోయాను, మళ్లీ లేచాను. అప్పుడు నాకు నేను చెప్పుకున్న డైలాగ్ ఇదే. ఎప్పుడూ సినిమాగాని, టీజర్గాని, ట్రైలర్ గాని అదిరిపోతుందని కాన్ఫిడెంట్‌గా చెప్పలేను. ఎందుకంటే నచ్చాల్సింది మీకు. చింపాల్సింది మీరు. మీకు నచ్చాలి. ఇతర భాషల ఆడియన్స్‌కు కూడా థ్యాంక్స్. రాబోయే పాన్ ఇండియన్ సినిమాలకు ఆల్ ది బెస్ట్. 'పుష్ప' కూడా పాన్ ఇండియన్ సినిమానే. మైత్రి మూవీ మేకర్స్‌కు థ్యాంక్స్. సినిమాకు పనిచేసిన టెక్నికల్ టీం, దేవీ శ్రీ ప్రసాద్‌కు స్పెషల్ థ్యాంక్స్' అని చెప్పారు.
'ఈ సినిమాతో అద్భుతమైన పర్ఫార్మెన్స్ అందించబోతున్నాం. ఈ సినిమా చూసిన తర్వాత స్టయిలీష్ లేేదనిపించింది. అందుకే ఆయన అన్నింట్లోనూ యూనిక్. అందుకే ఆయన స్టయిలీష్ స్టార్ కాదు ఐకాన్ స్టార్. బన్నీని 'ఆర్య' అని పిలిచారు. కానీ ఈ సినిమా తర్వాత రెండే విషయాలు ఉంటాయి. ఒకటి ఐకాన్ స్టార్ లేదంటే 'పుష్ప' అని పిలవాలి. మా నిర్మాతలకు థ్యాంక్స్. వాళ్లు లేకపోతే సినిమా లేదు' అని దర్శకుడు సుకుమార్ అన్నారు.