Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'ఆకాశం నీ హద్దురా' సినిమాతో హీరో సూర్య అఖండ విజయాన్ని అందుకున్న విషయం విదితమే. తెలుగు, తమిళ భాషల్లో విడుదలైన ఈ చిత్రానికి సుధా కొంగర దర్శకత్వం వహించారు. ఎయిర్ దక్కన్ వ్యవస్థాపకుడు కెప్టెన్ గోపీనాథ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా తర్వాత సూర్య నటించబోయే కొత్త సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు పెరిగాయి. ఈ అంచనాలకు తగినట్టుగానే మేకర్స్ రాజీపడకుండా సినిమాని నిర్మిస్తున్నారు.
సూర్య తన 40వ సినిమాని పాండిరాజ్ దర్శకత్వంలో చేస్తున్నారు. 'గ్యాంగ్ లీడర్', 'శ్రీకారం' సినిమాలతో టాలీవుడ్లో మంచి పేరు తెచ్చుకున్న యంగ్ బ్యూటీ ప్రియాంక అరుల్ మోహన్ సూర్య సరసన నటిస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ బ్యానర్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. సామాజిక అంశాలతో సూర్య ఇమేజ్‌కి ఏమాత్రం తగ్గకుండా మాస్ యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా దర్శకుడు పాండిరాజ్ తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా ఈ సినిమా చిత్రీకరణ జరుగుతోంది. కాగా, ఈ సినిమా నుంచి బ్యాక్ యాంగిల్లో సూర్య కత్తి పట్టుకున్న ఓ లుక్‌ని మేకర్స్ శుక్రవారం విడుదల చేశారు. డిఫరెంట్ బ్యాక్డ్రాప్లోఉన్న ఈ లుక్ సర్వత్రా సినిమాపై మంచి ఆసక్తిని క్రియేట్ చేసింది.