Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పవన్ కళ్యాణ్ నటించిన 'వకీల్ సాబ్' చిత్రం ఓవర్సీస్ సహా విడుదలైన అన్ని సెంటర్స్ నుంచి హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్ర బందం హైదరాబాద్‌లోని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ కార్యాలయంలో సక్సెస్ సెలబ్రేషన్స్ జరుపుకున్నారు.
ఈ సందర్భంగా నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ, 'లైఫ్‌లో ఎన్నో సక్సెస్‌లు చూశాను. నిర్మాతగా మారి 18 ఏళ్లవుతోంది. డిస్ట్రిబ్యూటర్‌గా అంతకుముందు నుంచే విజయాలు చూశాను. అయితే ఈ సినిమా సక్సెస్ ఎందుకో కొత్తగా అనిపిస్తోంది. థియేటర్లో సినిమా చూస్తుంటే నిర్మాత అనే విషయాన్ని మరచిపోయి ఫ్యాన్స్‌లాగే పేపర్స్ విసిరేశాను. పది నిమిషాల తర్వాత రియలైజ్ అయ్యాను. ఈ సినిమా మీద మాసివ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సినిమాను ఒక్కో స్టేజీలో చూస్తుంటే ఇలాంటి ఘన విజయాన్ని అంచనా వేశాం. ప్రేక్షకులు, అభిమానుల మధ్యలో సినిమా చూస్తుంటే ఒక అద్భుతమైన ఫీలింగ్ కలిగింది. అప్పటికే అమెరికా, దుబారు షోస్ నుంచి రిపోర్ట్స్ వస్తున్నాయి. విదేశాల నుంచి సినిమా సూపర్ హిట్ అనే టాక్ వచ్చింది. ఈ విజయం నాకు కొత్తగా అనిపించడానికి కారణం, నేను కళ్యాణ్ గారితో సినిమా చేయాలనే కోరిక కావొచ్చు, ఇలాంటి సబ్జెక్ట్ కావొచ్చు. పవన్‌తో పాటు ఈ సినిమా విజయ ఘనతని దర్శకుడు శ్రీరామ్ వేణుకు ఇస్తాను. గంటా పదిహేను నిమిషాల సెకండాఫ్‌కి అయితే విజిల్స్, చప్పట్లు కొడుతున్నారు. సినిమా అయ్యాక దర్శకుడు వేణుకు కాల్ చేశాను. ఇద్దరం కలిసి పవన్ కళ్యాణ్ గారి దగ్గరకు వెళ్లాం. సినిమా సక్సెస్ గురించి చెప్పాం. ఆయన కూడా చాలా సంతోషంగా ఫీలయ్యారు. కళ్యాణ్ గారు చాలా సక్సెస్‌లు చూశారు కానీ వకీల్ సాబ్‌లో అమ్మాయిలు, మహిళల గొప్పదనం తెలిపే కంటెంట్ ప్రేక్షకులకు రీచ్ అయితే ఆ సంతప్తి వేరుగా ఉంటుంది. కళ్యాణ్ గారి కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ అంటూ చెబుతున్నారు. ఈ సినిమా ఎంత సునామీ సష్టిస్తుందో ఇప్పుడో చెప్పలేం. 18 ఇయర్స్ నుంచి మా సంస్థలో ఉన్న వేణు, నా డ్రీమ్ ప్రాజెక్ట్‌కు ఇంత విజయాన్ని ఇచ్చాడు' అని తెలిపారు.
దర్శకుడు శ్రీరామ్ వేణు మాట్లాడుతూ, 'యూత్, మాస్, మహిళలు ఇలా..అన్ని వర్గాల ప్రేక్షకులు సినిమాను ఆస్వాదిస్తున్నారు. బ్లాక్ బస్టర్ హిట్ అని చెబుతున్నారు. అభిమాన హీరోతో హిట్ సినిమా చేసి ఆడియెన్స్ ఏమనుకుంటున్నారో, తిరిగి ఆయనతో చర్చించుకోవడం మాటల్లో చెప్పలేని అనుభూతినిచ్చింది. లైఫ్ లాంగ్ ఈ మూవ్ మెంట్స్ గుర్తుపెట్టుకుంటాను' అని చెప్పారు.