Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే జంటగా తెరకెక్కుతున్న చిత్రం 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్'. అల్లు అరవింద్ సమర్పణలో బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కిస్తున్న ఈ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ని జీఏ2 పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. బన్నీ వాసు, దర్శకుడు వాసు వర్మ నిర్మాతలు. ఈ సినిమాలో అఖిల్ అక్కినేని సరసన పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తోంది. అఖిల్ పుట్టిన రోజు సందర్భంగా ఇటీవల చిత్ర బృందం అఖిల్ బర్త్ డే పోస్టర్ని విడుదల చేసిన విషయం విదితమే. ఈ పోస్టర్లో అఖిల్ స్టయిలీష్ లుక్‌తో అందరినీ విశేషంగా అలరించారు. ఈ పోస్టర్‌కి అన్ని చోట్ల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది.
''మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' చిత్రాన్ని ప్రకటించిన రోజు దగ్గర్నుంచి ఈ సినిమాపై అక్కినేని అభిమానుల్లో ఆసక్తి మొదలైంది. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు దర్శక, నిర్మాతలు విడుదల చేసిన అఖిల్ ఫస్ట్ లుక్, గోపీ సుందర్ సంగీత సారధ్యంలో సిద్ శ్రీరామ్ పాడిన 'మనసా మనసా..' పాటకు, ఆ తర్వాత విడుదల చేసిన టీజర్‌కి, అలాగే ఇటీవల రిలీజ్ చేసిన 'ఏ జిందగీ..' పాటకు అటు సోషల్ మీడియాలోను, ఇటు అభిమానుల్లోనూ అనూహ్యమైన స్పందన లభించడం యూనిట్లో కొత్త ఉత్సాహన్ని తెచ్చింది. ఇదే ఉత్సాహంలో అభిమానులు, ప్రేక్షకులతో షేర్ చేసుకున్న బర్త్ డే పోస్టర్ కూడా మంచి స్పందన రాబట్టుకుంది. దీంతో ఈ సినిమాపై రోజు రోజుకి అంచనాలు మరింతగా పెరుగుతున్నాయి. ఈ సినిమాని జూన్ 19న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ తన చిత్రాల్లోని పాత్రల్ని చాలా క్యూట్ రొమాన్స్‌తో, లవ్లీగా ఉండేలా డిజైన్ చేస్తారు. ఇప్పుడు ఈ సినిమాలో కూడా అఖిల్ అక్కినేని, పూజాల మధ్య కూడా అలాంటి కెమిస్ట్రీని ఉండేలా డిజైన్ చేశారు' అని చిత్ర బృందం తెలిపింది.