Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సిద్ధార్థ్, సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్ హీరోలుగా రూపొందుతున్న చిత్రం 'ఒరేరు బామ్మర్ది'. 'బిచ్చగాడు' వంటి సూపర్ హిట్ చిత్రాన్ని తెరకెక్కించిన శశి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. కశ్మీర పరదేశి, లిజోమోల్ జోస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అభిషేక్ ఫిలిమ్స్ పతాకంపై తెరకెక్కిన ఈ భారీ యాక్షన్ సినిమాకి రమేష్ పి పిళ్లై నిర్మాత. ఈ సినిమాని శ్రీ లక్ష్మి జ్యోతి క్రియేషన్స్ పై ఏ.ఎన్ బాలాజీ ఈ నెలలో తెలుగులో విడుదల చేయనున్నారు.
సిద్ధూ కుమార్ సంగీతం సమకూరుస్తున్న ఈ సినిమాకి ప్రసన్నకుమార్ సినిమాటోగ్రఫీ అందించారు. సిద్ధార్థ్, జీవీ ప్రకాష్ కుమార్ కాంబినేషన్లో వచ్చే యాక్షన్ సన్నివేశాలు ఈ చిత్రానికి హైలైట్‌గా నిలవనున్నాయి. ఇప్పటికే రిలీజైన ఫస్ట్ లుక్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే తాజాగా ఈ సినిమా టీజర్ గ్లిమ్ప్స్ని చిత్ర బృందం రిలీజ్ చేసింది.
ఈ సందర్భంగా ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేస్తున్న శ్రీ లక్ష్మి జ్యోతి క్రియేషన్స్ అధినేత ఏ.ఎన్. బాలాజీ మాట్లాడుతూ, 'సిద్ధార్థ్, జీవిప్రకాష్ కుమారు నటించిన ఈ యాక్షన్ సినిమాని తెలుగులో రిలీజ్ చేయడం ఎంతో ఆనందంగా ఉంది. సినిమాకి మంచి రెస్పాన్స్ వస్తుందన్న నమ్మకం ఉంది. ఇద్దరు హీరోలు పోటాపోటీగా నటించారు. ఫస్ట్‌లుక్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. టీజర్ కూడా అందరికి నచ్చుతుందని ఆశిస్తున్నాను' అని చెప్పారు.