Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'ఈ ఉగాదికి నాకు 'లెవెన్త్ అవర్' రూపంలో మంచి గిఫ్ట్ దొరికింది. 'ఆహా'లో ప్రసారం అవుతున్న ఈ వెబ్ సిరీస్‌కి అనూహ్య స్పందన లభిస్తోంది' అని తమన్నా చెప్పారు. తమన్నా ప్రధాన పాత్రధారిణిగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో నటించిన వెబ్‌సిరీస్ 'లెవెన్త్ అవర్'. ఉగాది కానుకగా ఈ వెబ్ సిరీస్ శుక్రవారం నుంచి 'ఆహా'లో స్ట్రీమింగ్ అవుతోంది. దీనికి మంచి స్పందన లభిస్తున్న నేపథ్యంలో శుక్రవారం వెబ్ సిరీస్ బృందం విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా తమన్నా మాట్లాడుతూ,'మంచి కంటెంట్‌తో రూపొందిన వెబ్‌సిరీస్ ఇది. ముఖ్యంగా మహిళల శక్తి ఏంటో తెలియజేస్తుంది. ఓ రోజు రాత్రి జరిగే కథ. ఓ హౌటల్లో రాత్రి పదకొండు గంటల నుంచి పొద్దున ఎనిమిది గంటల వరకు జరిగే కథ. ఈ ఎనిమిది గంటల్లో కథలో ప్రధాన పాత్రధారి అరత్రికా రెడ్డి బ్యాంకుకి పదివేల కోట్ల రూపాయలను చెల్లించాలి. అలా చెల్లించకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. అలాంటప్పుడు ఆమె కట్టాల్సిన డబ్బును కట్టిందా? లేదా? అనేదే ఈ వెబ్ సిరీస్. అరత్రికా రెడ్డి పాత్రను పోషించడాన్ని చాలా గర్వంగా ఫీలవుతున్నా. ఈ పాత్రలో ఉన్న ఎమోషన్స్ అందరికీ బాగా కనెక్ట్ అవుతాయి. దర్శకుడు ప్రవీణ్ సత్తారు అద్భుతంగా దీన్ని పిక్చరైజ్ చేశారు. నిర్మాత, రచయిత ప్రదీప్ దీన్ని ఎక్కడా రాజీపడకుండా నిర్మించారు' అని చెప్పారు. 'ఇందులో నేను తమన్నా ఫ్రెండ్‌గా, ఓ బిగ్‌షాట్‌గా నటించాను. ఈ వెబ్‌సిరీస్‌కి వస్తున్న రెస్పాన్స్ చాలా సంతోషాన్నిచ్చింది' అని అరుణ్ అదిత్ అన్నారు.