Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తను ప్రేమించిన అమెరికన్ అమ్మాయిని తన మాత దేశానికి తీసుకు రావాలనే కోరికతో దేశం మారిపోతే లైఫ్ సరదాగా ఉంటుందని నచ్చజెపుతూ ఓ ఇండియా అబ్బాయి చేసిన చిన్న ప్రయత్నమే 'పాప ఛలో హైదరాబాద్'. జెమినీ కన్సల్టింగ్, సర్వీసెస్ పతాకంపై సింగర్ శ్రీకాంత్ సందుగు పాడిన 'పాప ఛలో హైదరాబాద్' మ్యూజిక్ ఆల్బమ్‌కి ఆనంద్భట్ దర్శకత్వం వహించగా, శ్రీని రజినీకాంత్ గంగవరవు నిర్మించారు.
ప్రసాద్‌ల్యాబ్స్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మంచు లక్ష్మి, ఆర్.పి. పట్నాయక్ చేతుల మీదుగా ఈ మ్యూజిక్ ఆల్బమ్ రిలీజైంది. అలాగే ఇదే కార్యక్రమంలో ఆర్.పి.పట్నాయక్ రాసిన 'అమ్మ పాట' ప్రోమోను కూడా విడుదల చేశారు. ఈ పూర్తి పాటను అమ్మలకు డెడికెట్ చేస్తూ మదర్స్ డే సందర్భంగా మే 9న విడుదల చేయబోతున్నారు.
ఈ సందర్భంగా మంచు లక్ష్మి మాట్లాడుతూ, 'నా కెరియర్ కూడా యు.ఎస్ నుండే స్టార్ట్ అయింది. అయితే మనం యు.ఎస్‌లో ఉండి ఎంత పేరు సంపాదించుకున్నా, మాతదేశంలో మన పాటను, మన ఫొటోను బిగ్ స్క్రీన్ పై చూసుకుంటే ఆ కిక్కే వేరు. తను నటిస్తూ, పాడిన ఈ ఆల్బమ్ శ్రీకాంత్‌కు మంచి పేరు తెచ్చిపెట్టాలి. ఆయన ఇంకా ఎన్నో పాటలను ఇక్కడ ఆడియన్స్‌కు పరిచయం చేయాలని అశిస్తున్నాను' అని చెప్పారు.
'ఆమెరికాలో జరిగే నా షోస్‌లో శ్రీకాంత్ టీమ్ తప్పకుండా ఉండేలా చూసుకుంటాను. ఎందుకంటే వీళ్ళు చేసే ప్రతిదీ కొత్తగా ఉండాలని కొరుకుంటుంటారు. శ్రీకాంత్ అమెరికాలో ఎన్నో మ్యూజిక్ ఆల్బమ్స్ చేశారు. తాజాగా ఆయన నటిస్తూ, పాడిన ఈ ఆల్బమ్ ఇండియాలో విడుదల అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అమెరికా వాళ్ళు పాడిన ఆల్బమ్స్ ఎంతటి విజయం సాధించాయో, అలాగే ఈ ఆల్బమ్ కూడా అంతే పెద్ద విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లైఫ్ ఎప్పుడు అమ్మతోనే మొదలవుతుంది. అలాగే నా సెకెండ్ ఇన్నింగ్స్ కూడా 'అమ్మ పాట'తో ఆరంభం అవుతున్నందుకు చాలా హ్యాపీగా ఉంది' అని సంగీత దర్శకుడు ఆర్.పి.పట్నాయక్ అన్నారు.
సింగర్ శ్రీకాంత్ సందుగు మాట్లాడుతూ, 'అమెరికాలో జరిగిన 'పాడుతా తీయగా' మొదటి ఎపిసోడ్లో సింగర్‌గా పాడాను. ఆ పాటకు బాలు గారు నన్ను అప్రిసియేట్ చేయడం జీవితంలో మరచిపోలేను. ఆ టైమ్‌లో ఆయన చెప్పిన మాటలకు మోటివేట్ అయ్యాను. అప్పటినుండి సింగర్ కావాలని డిసైడ్ అయ్యాను. యు.ఎస్‌లో ఇప్పటి వరకు 450 ప్రోగ్రామ్స్ చేశాను. పాటలతోనే కాకుండా విజువల్‌గా కూడా నేను ప్రేక్షకులకు దగ్గరవ్వాలని చేసిన ప్రయత్నమే ఈ ఆల్బమ్. నేను పుట్టి, పెరిగిన హైదరాబాద్‌లో నా కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్ సమక్షంలో ఈ ఆల్బమ్ లాంచ్ ఈవెంట్ ఘనంగా జరిగినందుకు చాలా ఆనందంగా ఉంది' అని చెప్పారు.