Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పవన్ కళ్యాణ్ తాజాగా నటించిన చిత్రం 'వకీల్ సాబ్'. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో దిల్‌రాజు నిర్మించిన ఈ చిత్రం ఇటీవల విడుదలై మంచి ఆదరణ పొందుతోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా సాధిస్తున్న విజయం పట్ల తన సంతోషాన్ని నివేదా థామస్ మీడియాతో షేర్ చేసుకున్నారు. ఇలాంటి గొప్ప చిత్రంలో భాగమైనందుకు గర్వంగా ఉందని తెలిపారు.
ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ,'ఈ సినిమాకు ప్రేక్షకులు చాలా పెద్ద సక్సెస్ ఇచ్చారు. మనం సినిమాలను సినిమాగా చూస్తుంటాం. కానీ కొన్ని చిత్రాలను మాత్రమే ఇవి మన కోసం చేసిన సినిమాలు అనిపిస్తాయి. ఈ చిత్రాన్ని ఆడియెన్స్ అలా ప్రత్యేకంగా ఫీలవుతున్నారు. పవర్ స్టార్ ఫ్యాన్స్ సంతోషం, సినిమాకి వస్తున్న వసూళ్లు చూస్తుంటే ఆనందంగా ఉంది. ఇవే కాదు అనేక కారణాలతో ఈ సినిమా నాకు చాలా చాలా స్పెషల్.
'పింక్' లాంటి సినిమాని తెలుగులో చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా రూపొందించాలని ఆలోచించాం. మా ప్రయత్నం ఇవాళ ప్రేక్షకుల ఆదరణ పొందుతుండటం సంతప్తిగా ఉంది. అయితే ప్రమోషన్ టైమ్‌లో నాకు కొవిడ్ రావడం కొంత బాధగా అనిపించింది. నాకు మాత్రం ఒక్కసారి బయటకు వెళ్లి థియేటర్లలో ఆడియెన్స్ రెస్పాన్స్ ఎలా ఉందో చూడాలని ఉంది. ఈ సినిమాలో నా క్యారెక్టర్‌తో పాటు మిగతా ఇద్దరు అమ్మాయిల క్యారెక్టర్ల గురించి పూర్తిగా తెలుసు. కానీ మొత్తం సినిమా ఎలా చేస్తున్నారు అనే విషయం తెలియదు. మా దర్శకుడు శ్రీరామ్ వేణు మీద నాకు చాలా నమ్మకం ఉంది. పవర్ స్టార్ అభిమానులకు తగినట్లు మార్పులు చేస్తూనే 'పింక్' కథలోని సోల్‌ను ఏమాత్రం పక్కకు పెట్టకుండా, బాగా బ్యాలెన్స్ చేస్తూ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. కమర్షియల్ ఎలిమెంట్స్‌తో పాటు ఒరిజినల్ కథలోని సోల్ బాగా బ్యాలెన్స్ అయ్యింది. అది అభిమానులతో పాటు కామన్ ఆడియెన్స్‌కి కూడా బాగా కనెక్ట్ అయ్యింది. ఈ క్యారెక్టర్ చేస్తున్నప్పుడు దాని గురించి నేను ఎక్కువగా ఆలోచించలేదు. చిత్రీకరణ చేస్తున్నంత సేపు మాత్రమే ఆ పాత్రను మనసులో ఉంచుకున్నాను. ఎందుకంటే చాలా మంది జీవితాల్లో ఇలాంటి ఇబ్బందులు ఎదురవుతుంటాయి. ప్రస్తుత సమాజంలో వాస్తవ ఘటనలకు చాలా దగ్గరగా ఉంటుందీ సినిమా. నేను కూడా కొన్ని సార్లు ఇబ్బందికర సందర్భాలు ఎదుర్కొన్నాను. కాబట్టి ఈ పాత్ర గురించి ఎక్కువగా ఆలోచిస్తే అది మనసుని పాడు చేస్తుంది. సాధ్యమైనంత వరకు ఈ పాత్రను పర్సనల్ గా తీసుకోలేదు.
ఈ సినిమాకి థమన్ ఇచ్చిన అవుట్‌ఫుట్ మరే సంగీత దర్శకుడూ ఇవ్వలేరని నా అభిప్రాయం. ఈ చిత్రానికి ఆయన సంగీత దర్శకుడిగా కంటే పవర్ స్టార్ అభిమానిగా పనిచేశారు. 'మగువా మగువా..' పాట సినిమా రిలీజ్‌కు ముందే చాలా పెద్ద హిట్ అవ్వడం మా అదష్టం. ఆ పాట సినిమా ప్రారంభంలోనే రావడం వల్ల మా క్యారెక్టర్స్ ఆడియెన్స్‌కు బాగా కనెక్ట్ అయ్యాయి. పవర్ స్టార్‌తో కలిసి నటించడం ఒక స్పెషల్ ఎక్స్పీరియన్స్. ఆయన చాలా నైస్ పర్సన్. థాట్ ఫుల్‌గా, కామ్‌గా ఉండేవారు. సినిమాని ప్రేమించే నిర్మాత దిల్ రాజు. నిర్మాతగానే కాకుండా ఓ అభిమానిగా ఆయన కళ్యాణ్‌గారితో సినిమా చేయాలని ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూస్తున్నారు. ఆయన కల ఈ సినిమాతో నెరవేరినందుకు చాలా సంతోషంగా ఉంది. అంతేకాదు ఈ సినిమా సాధిస్తున్న విజయం దిల్‌రాజుగారికి జీవితాంతం గుర్తుండిపోతుంది. ఇంతకన్నా ఓ నిర్మాతకి ఏం కావాలి?. కల నెరవేరడంతోపాటు బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టడం ఒక్క దిల్‌రాజుగారికే సాధ్యమైంది. ప్రస్తుతం 'మిడ్ నైట్ రన్నర్స్' అనే కొరియన్ రీమేక్ చిత్రంలో నటిస్తున్నాను. దీన్ని సురేష్ ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. సుధీర్ వర్మ డైరెక్టర్. నేను, రెజీనా ముఖ్య పాత్రల్ని పోషిస్తున్నాం' అని తెలిపారు.