Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చాలా కాలంగా అప్డేట్స్ కోసం ఎదురు చూస్తున్న అభిమానులను ఖుషీ చేసేందుకు నందమూరి బాలకృష్ణ రంగం సిద్ధం చేశారు. ఉగాది కానుకగా తన తాజా సినిమా టైటిల్‌ని అధికారికంగా ప్రకటించబోతున్నారు. నందమూరి బాలకష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికే బీబీ3 అనే ట్యాగ్ ప్రచారంలో ఉంది. పవర్ఫుల్ మాస్ ఎంటర్టైనర్గా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాకి సంబంధించి ఆదివారం ఓ అప్డేట్ని చిత్రబందం సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. ఉగాది కానుకగా ఈ సినిమా టైటిల్‌ను ఎనౌన్స్ చేయనున్నట్లు ప్రకటించింది. 'సింహా', 'లెజెండ్' చిత్రాల తర్వాత బాలకష్ణ-బోయపాటి శ్రీను కాంబినేషన్లో వస్తున్న మూడో చిత్రమిది. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ఈ చిత్రానికి మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు. ప్రగ్యాజైశ్వాల్, శ్రీకాంత్, పూర్ణ కీలకపాత్రల్లో కనిపించనున్నారు. వేసవి కానుకగా మే 28న ఈ సినిమాని వరల్డ్‌వైడ్‌గా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ కర్నాటకలో జరుగుతోంది.