Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భారతీయ సినీ పరిశ్రమలో జెమిని సంస్థది ఒక సువర్ణాధ్యాయం. వందల సినిమాల నిర్మాణంతోపాటు ఎంతో మంది నటీనటులకు, సాంకేతిక నిపుణులకు కెరీర్ ఇచ్చిన సంస్థ. జెమిని గ్రూపులో ఎన్నో సంస్థలు ఉన్నాయి. జెమిని ఫిల్మ్ సర్క్యూట్, జెమిని ఎఫ్ఎక్స్, జెమినీ స్టూడియోస్ వంటి తదితర సహ సంస్థలు చాలానే ఉన్నాయి. 75 సంవత్సరాల చరిత్ర ఉన్న జెమినీ సంస్థ డైమండ్ జూబ్లీ ఉత్సవాలు జెమినీ సంస్థల సీఈఓ పీవిఆర్ మూర్తి చేతుల మీదుగా సోమవారం ఘనంగా జరిగాయి. డైమండ్ జూబ్లీ సందర్భంగా ప్రతిష్టాత్మక జెమిని గ్రూప్ మ్యూజిక్ ఇండిస్టీలోకి కూడా అడుగు పెట్టబోతుండటం విశేషం. జెమినీ రికార్డ్స్ లేబుల్‌తో సంగీత ప్రపంచంలోకి అడుగిడనుంది. జెమినీ రికార్డ్స్ ప్రైవేట్ ఆల్బమ్స్‌ను నిర్మించడమే కాకుండా, సినిమాలకు కూడా పని చేయనున్నారు. సినిమా పాటలను కూడా జెమినీ రికార్డ్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. సినీ చరిత్రలో ఓ ప్రత్యేక చరిత్రని లిఖించుకున్న జెమిని తాజాగా మ్యూజిక్ ఇండిస్టీలో కూడా దిగ్విజయంగా కొనసాగాలని అతిథులుగా విచ్చేసిన సినీ ప్రముఖులు ఆకాంక్షించారు.