Authorization
Mon Jan 19, 2015 06:51 pm
26/11 ముంబై దాడుల్లో దేశం కోసం ప్రాణాలను అర్పించిన దివంగత ఆర్మీ ఆఫీసర్ మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం 'మేజర్'.అడివిశేష్ మేజర్‌గా టైటిల్ రోల్ పోషించిన ఈ ప్యాన్ ఇండియా చిత్రానికి శశి కిరణ్ తిక్కా దర్శకుడు. శోభితా ధూళిపాల, సయీ మంజ్రేకర్, ప్రకాష్ రాజ్, రేవతి, మురళి శర్మ ముఖ్య పాత్రల్లో నటించారు. మహేష్ బాబు జీఎంబీ ఎంటర్టైన్మెంట్, ఏ ప్లస్ఎస్ మూవీస్ సహకారంతో సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. జులై2న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది. సోమవారం ఈ చిత్ర తెలుగు టీజర్‌ను మహేష్ బాబు, హిందీ వెర్షన్ టీజర్‌ను సల్మాన్‌ఖాన్, మలయాళ టీజర్‌ను హీరో పథ్విరాజ్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఏఎంబి మాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దర్శకుడు శశి కిరణ్ తిక్కా మాట్లాడుతూ, 'మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం నన్ను ఇన్స్పైర్ చేసింది. నా లైఫ్ లాంగ్ ఈ సినిమా గురించి చాలా గర్వంగా చెప్పుకుంటాను' అని అన్నారు.
నిర్మాత శరత్ మాట్లాడుతూ, 'ఇదొక థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ మూవీ' అని తెలిపారు. 'సోనీ పిక్చర్స్ ఎన్నో భాషల్లో సినిమాలు చేసింది. వాళ్ళు ఎక్కడికి వెళ్లినా, ఈ సినిమా హైదరాబాద్ నుంచే చేశామని గర్వంగా చెప్పుకునే విధంగా ఈ సినిమా ఉంటుంది. దర్శకుడు శశి చాలా బ్యాటిఫుల్గా తెరకెక్కించారు' అని మరో నిర్మాత అనురాగ్ చెప్పారు.
అడివిశేష్ మాట్లాడుతూ, '2008లో ముంబై ఎటాక్స్ జరిగినప్పుడు నేను యూఎస్‌లో ఉన్నాను. సందీప్ ఫొటో చూసినప్పుడు నాకు అన్నయ్యలా ఉన్నారనిపించింది. ఒక సొంత అన్నయ్యను కోల్పోయాం అనే ఫీలింగ్ వచ్చింది. కొంత మంది డిస్ట్రిబ్యూటర్స్ నన్ను అడిగారు ఇది ఏ సెంటర్ ఫిలిమా? లేదా బి, సి సెంటర్స్ సినిమానా? అని, వారందరికీ నేను ఒక్కటే చెప్పదలుచుకున్నాను, ఇది మనిషికి నచ్చే సినిమా. మనిషిలోని ప్రతి ఫీలింగ్‌ని చూపించే చిత్రమిది. సోనీ పిక్చర్స్ భాగస్వామ్యంతో మా సినిమా ఇంటర్నేషనల్ లెవల్‌కి వెళ్లింది. మా సినిమా టీజర్‌ని మూడు భాషల్లో ముగ్గరు బిగ్ స్టార్స్ లాంచ్ చేయడం చాలా హ్యాపీగా ఉంది' అని అన్నారు.
'ఈ సినిమా ఒక గ్రేట్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. ఈ మూవీ రిలీజ్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నాను' అని కథానాయిక సయీ మంజ్రేకర్ అన్నారు. హీరోయిన్ శోభిత ధూళిపాల మాట్లాడుతూ, 'ఇదే టీమ్‌తో 'గూడఛారి' చేశా. 'మేజర్' లాంటి ఒక గొప్ప మూవీలో భాగం అవడం చాలా గర్వంగా ఉంది' అని చెప్పారు.