Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎన్టీఆర్ తన కొత్త సినిమాని ఉగాది కానుకగా ఎనౌన్స్ చేసి అభిమానులను ఫుల్ ఖుషీ చేశారు. ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ మళ్ళీ రిపీట్ కాబోతోంది. వీరిద్దరి కాంబోలో తెరకెక్కిన 'జనతా గ్యారేజ్' ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. మళ్ళీ ఆ మ్యాజిక్‌ని రిపీట్ చేసేందుకు మేకర్స్ రంగం సిద్ధం చేశారు. ఇది ఎన్టీఆర్ నటించబోయే 30వ సినిమా కావడం విశేషం.
భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ 'ఆర్ఆర్ఆర్' తర్వాత ఎన్టీఆర్ చేయబోయే చిత్రమిది. 'ఎన్టీఆర్ 30 అని, ఎన్టీఆర్ - కొరటాల శివ 2గా పిలవబడుతున్న ఈ చిత్రం నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో, యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై నిర్మితం కానుంది. ఈ భారీ స్థాయి పాన్ ఇండియా చిత్రానికి మిక్కిలినేని సుధాకర్, కొసరాజు హరికష్ణ నిర్మాతలు. ఈ సందర్భంగా నిర్మాతలు ఈ సినిమా గురించి మాట్లాడుతూ,'ఈ చిత్రం త్వరలోనే ముహూర్త కార్యక్రమాలు జరుపుకుని, జూన్ ద్వితీయ భాగంలో సెట్స్ పైకి వెళ్తుంది. ఏప్రిల్ 29, 2022న పలు భారతీయ భాషల్లో ఈ చిత్రం విడుదల అవుతుంది. ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ పై సహజం గానే భారీ అంచనాలు ఉంటాయి. పైగా 'జనతా గ్యారేజ్' వంటి బిగ్గెస్ట్ హిట్ తర్వాత వీరి కాంబోలో రాబోయే సినిమా ఇది. దీంతో ఆ అంచనాలకు తగ్గట్టుగా, భారీ స్థాయిలో ఈ చిత్రం ఉంటుంది. ఇతర వివరాలను ముహూర్తం రోజున తెలియజేస్తాం' అని తెలిపారు.