Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రముఖ నిర్మాణ సంస్థ జియో స్టూడియోస్, ఆస్కార్ అవార్డ్ గ్రహీత ఎ.ఆర్.రెహ్మాన్ కాంబినేషన్లో రూపొందిన ప్రేమకథా చిత్రం '99 సాంగ్స్'. ఇహాన్ భట్, ఎడిల్సీ జంటగా నటించారు. విశ్వేష్ కష్ణమూర్తి తెరకెక్కించిన ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈనెల 16న విడుదల చేస్తున్నారు. ఈ సందర్బంగా సోమవారం ఎ.ఆర్.రెహ్మాన్, హీరో ఇహాన్ భట్ పాత్రికేయులతో ముచ్చటించారు. ఎ.ఆర్.రెహ్మాన్ మాట్లాడుతూ,' ఈ సినిమా మ్యూజిక్‌కి సంబంధించిన సినిమానే అయినప్పటికీ ఇందులో చాలా లేయర్స్ ఉన్నాయి. ఈ చిత్రానికి మెయిన్ సోల్ మ్యూజిక్. అలాగే స్టోరీ నెరేషన్. ఈ సినిమాని పాత ప్రపంచం, కొత్త ప్రపంచానికి మధ్య ఉన్న వేరియేషన్‌ను చూపించేలా తెరకెక్కించాం. ఇందులో ప్రేమ ఉంది. ఆర్టిస్టిక్ పంథాలో క్వాలిటీగా, ఆసక్తికరంగా ఉండేలా తెరకెక్కించాను. నేటి జనరేషన్‌కు తగినట్టుగా ఓ కొత్త డైరెక్టర్‌తో చేయాలనే ఉద్దేశంతో విశ్వేష్ కష్ణమూర్తిని దర్శకుడిగా తీసుకున్నాను. ఆయన సంగీత దర్శకుడు కూడా. సంగీతం అనేది తరాలను, సంస్కతులను కలిపే ఓ సాగరం. ఈ సినిమాలో కూడా హీరో పాత్ర పాత తరానికి, కొత్త తరానికి మధ్య సంఘర్షణ పడుతుంటాడు. ఈ పాయింట్ ప్రేక్షకులను నచ్చుతుందని భావిస్తున్నాను. గత దశాబ్దంలోని ఆడియెన్స్‌కు, ఇప్పటి ఆడియెన్స్‌కు చాలా తేడా ఉంది. ఇప్పటి ప్రేక్షకులు వరల్డ్ సినిమాలను చూస్తున్నారు. మన ప్రేక్షకులు ఇతర భాషల సినిమాలను ఎలా చూస్తున్నారో మన సంస్కతిని తెలియజేసే సినిమాలను ఇతర దేశాల ప్రేక్షకులు చూసే అవకాశం ఉంది' అని చెప్పారు.
'ఇప్పుడు నన్ను ఎవరూ చూసిన రెహ్మాన్గారి హీరోవి అని అంటున్నారు. రెహ్మాన్‌గారు నాకొక ఐడెంటిటీగా మారటం చాలా సంతోషంగా ఉంది' అని హీరో ఇహాన్ భట్ అన్నారు.