Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అఖిల్ సార్ధక్, అనిక విక్రమన్ జంటగా ఐ.హేమంత్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం 'ఫస్ట్ టైం'. హేమంత్ ఆర్ట్స్ పతాకంపై నిర్మితమవుతున్న ఈ చిత్రం ఉగాది పర్వదినం సందర్భంగా ప్రసాద్ ల్యాబ్‌లో జరిగిన పూజ కార్యక్రమాలతో ఆరంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన ఎం.ఎల్.ఎ. రఘునందన్ ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టగా, దర్శకులు జి.నాగేశ్వర్ రెడ్డి కెమెరా స్విచ్ ఆన్ చేశారు. నిర్మాత టి. రామసత్యనారాయణ ఫస్ట్ షాట్ డైరెక్షన్ చేశారు. ఈ సందర్భంగా దర్శక, నిర్మాత ఐ.హేమంత్ మాట్లాడుతూ, 'బిగ్ బాస్ ఫేమ్ అఖిల్ ఈ సినిమా తరువాత పెద్ద హీరో అవుతాడు. త్వరలో ఈ సినిమా చిత్రీకరణ కోసం కర్నాటకలోని అప్సర కొండ బీచ్‌కు వెళ్తున్నాం. అక్కడ రెగ్యులర్ చిత్రీకరణ స్టార్ట్ చేసి, అదే నెల చివరికల్లా ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేస్తాం. అన్ని అనుకున్నట్లు చిత్రీకరణ జరిగితే వరల్డ్‌లోనే ఫస్ట్ టైం న్యూ ఫార్మాట్లో ప్రిలుక్ టీజర్‌ను రిలీజ్ చేస్తాం. ఇది పూర్తి రొమాంటిక్ అడ్వెంచరస్ మూవీ. ఆగస్ట్‌లో ఈ సినిమాని విడుదల చేస్తాం. ఈ మూవీ ద్వారా కొన్ని కొత్త టెక్నాలజీలను తీసుకొస్తున్నాం' అని తెలిపారు. 'ఇదొక డిఫరెంట్ యూనిక్ స్టోరీ. ఈ సినిమా కచ్చితంగా హిట్ అవుతుందనే నమ్మకం ఉంది' అని హీరో అఖిల్ చెప్పారు.