Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నూతన నటీనటులతో రాజ్‌కృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోంది. శ్రీమతి వీణదారి సమర్పణలో నేహా శ్రీ క్రియేషన్స్,సెవెన్ హిల్స్ ప్రొడక్షన్ పతాకంపై సతీష్ కుమార్.ఐ, కళ్యాణ్ సుంకర ప్రొడక్షన్ నెంబర్ 2గా దీన్ని నిర్మిస్తున్నారు. ఆర్.పి.పట్నాయక్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా పూజా కార్యక్రమాలు ఉగాది పర్వదినం సందర్భంగా మంగళవారం అన్నపూర్ణ స్టూడియోలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టగా, హాస్య నటుడు అలీ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. దర్శకుడు సతీష్ వేగేశ్న ఫస్ట్ షాట్ డైరెక్షన్ చేశారు. ఈ సందర్భంగా నిర్మాత సతీష్ కుమార్.ఐ మాట్లాడుతూ, 'ఆర్. పి.పట్నాయక్ మా సినిమాతో కమ్ బ్యాక్ అవుతున్నారు. రాజ్ కృష్ణని దర్శకుడిగా పరిచయం చేస్తున్నాం' అని చెప్పారు. లైన్ ప్రొడ్యూసర్ మాట్లాడుతూ,'మా కంపెనీ యూ మీడియా ద్వారా కాస్టింగ్ దగ్గర్నుంచి ప్రొడక్షన్ వరకు ఈ సినిమాకి అన్ని బాధ్యతలు తీసుకుని సతీష్‌కి సపోర్ట్ చేస్తాం' అని చెప్పారు. 'మే నుండి రెగ్యులర్ చిత్రీకరణ స్టార్ట్ చేసి, మే నెలాఖరుతో పూర్తి చేస్తాం. ఇది పూర్తి రోమ్ కామ్ ఎంటర్టైనర్' అని దర్శకుడు రాజ్‌కృష్ణ అన్నారు.