Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నట్టిస్ ఎంటర్టైన్మెంట్స్, పెగాసస్ సినీ కార్ప్ యల్.యల్.పి పతాకాలపై రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'దెయ్యం'. రాజశేఖర్, స్వాతి దీక్షిత్ ముఖ్యపాత్రల్లో జీవిత రాజశేఖర్, నట్టి కరుణ, నట్టి క్రాంతి, బోగారం వెంకట శ్రీనివాస్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం ఈ నెల 16న తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా దర్శకుడు రాంగోపాల్ వర్మ మాట్లాడుతూ, 'నేను, రాజశేఖర్ పలు చిత్రాలతో బిజీగా ఉండటంతో ఈ సినిమా లేట్ అయ్యింది. ఇందులో రాజశేఖర్ కూతురు పాత్రలో స్వాతి అద్భుతంగా నటించింది' అని తెలిపారు. 'ఇంత కాలానికి మా 'దెయ్యం' చిత్రానికి మంచి రోజులు వచ్చాయని భావిస్తున్నాను. అందరూ కరోనా నిబంధనలు పాటిస్తూ మా సినిమాని చూడాలని కోరుతున్నాను' అని నిర్మాత జీవిత రాజశేఖర్ చెప్పారు. మరో నిర్మాత నట్టి కుమార్ మాట్లాడుతూ,' ఈ కథలోని కంటెంట్ చాలా బాగుంది. తప్పకుండా హిట్ అవుతుందనే నమ్మకం ఉంది. ఈనెల 16న మా సినిమా థియేటర్లలో సోలోగా వస్తోంది' అని అన్నారు.