Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఫిల్మ్ డైరెక్టర్ తల్లాడ సాయికృష్ణ
నేడు విడుదలకు సిద్ధంగా 'నిన్ను చేరి' ఉగాది సందర్భంగా నేడు ట్రైలర్ విడుదలైంది. ఈ సందర్భంగా డైరెక్టర్ తల్లాడ సాయికృష్ణ మాట్లాడుతూ.. నేడు 'నిన్ను చేరి' ఊర్వశి ఓటిటి లో విడుదల అవుతున్నట్టు తెలిపారు. తేజా హనుమాన్ ప్రోడక్షన్స్ బ్యానర్లో శంకర్ కొప్పిశెట్టి నిర్మాతగా, సాయికృష్ణ తల్లాడ దర్శకత్వంలో తెరక్కెక్కిన సినిమా "నిన్ను చేరి". రాజు అనేం, మాధురి జంటగా, గౌతమ్ రాజు, భద్రం, శాంతి స్వరూప్, కిషోర్ దాస్, బేబీ హాసిని లు ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా నేడు విడుదల కానుంది. ఒక పల్లెటూరు బ్యాంక్ లో జరిగిన లవ్ స్టొరీ ప్రేక్షకులని అలరిస్తుందిని డైరెక్టర్ తల్లాడ సాయికృష్ణ అన్నారు. ఈ చిత్రానికి కథ, మాటలు శివ కాకు అందించగా, వి.ఆర్.ఏ.ప్రదీప్ అందించిన సంగీతం అలరించనుంది.