Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ చివ్వేంల : ప్రపంచ మేధావి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని పలువురు వక్తలు కొనియాడారు.
బుధవారం మండల పరిధిలోని వట్టిఖమ్మం పహాడ్ గ్రామంలో భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 130వ జయంతి సందర్బంగా పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సర్పంచ్ కలకొండ కరుణ శ్యాంసన్ , ఏపీపీ డపుకు మల్లయ్య, అంబేద్కర్ - పూలే సేవ సంఘం జిల్లా అధ్యక్షులు జటంగి వెంకటేశ్వర్లు యాదవ్ మాట్లాడుతూ.. దేశ గొప్పదనం మీరు మీరే లేకుంటే నా దేశం ఏమై పోతుండెనో ప్రపంచబిమేథావి సంఘసంస్కర్త, ఆర్దికబిశాస్త్రవేత్త, న్యాయశాస్త్రబికోవిదుడు, దళితులబిఆరాధ్యదైవం, అణగారినబివర్గాలబిఆశాజ్యోతి, సమాజంలోని కుల వివక్షను,
అంటరానితనానికి వ్వతిరేకంగా తన ఆఖరి ఊపిరి వరకు పోరాటం చేసి కోట్లాది మంది జీవితాల్లో వెలుగులు నింపిన మహనీయుడు అని అన్నారు. ఈ కార్యక్రమంలో మట్టపల్లి లింగయ్య, షేక్ నాగుల మీరా, మనన్ హనుమాన్ సింగ్, డపుకు మల్లయ్య,బామర్ జానకి రామ్ సింగ్,పేర్ల దేవేందర్, గోగుల రమేష్,గోగుల ఈదయ్య,కలకొండ నాగయ్య, రావిచెట్టు లింగస్వామి, కొండ బుచ్చిబాబు, గోగుల వెంకన్న,యసాని రామస్వామి తదితరులు పాల్గొన్నారు.