Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శివాంశును హీరోగా పరిచయం చేస్తూ ఆర్.వి.జీ మూవీజ్-ఎస్.వి.ఎల్.ఎంట్రప్రైజస్ సంయుక్తంగా ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ చిత్రం హైదరాబాద్లోని సత్యసాయి నిగమాగమంలో మొదలైంది.
రవిశంకర్ ఓంకాలి, తలారి వినోద్ కుమార్ ముదిరాజ్, శ్రీనివాస్ మామిడాల, లలిత్ కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి రుద్రాపట్ల వేణుగోపాల్ (ఆర్.వి.జి) దర్శకత్వం వహిస్తున్నారు. ప్రాచీరాయ్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రముఖ హీరోయిన్ ఆమని ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. దేవుడి పటాలపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి వి.ఎస్.పి.తెన్నేటి కెమెరా స్విచాన్ చేయగా, శ్రీమతి స్వాతి రుద్రాపట్ల క్లాప్ కొట్టారు. ఈ సందర్భంగా దర్శక, నిర్మాత రుద్రాపట్ల వేణుగోపాల్ మీడియాతో మాట్లాడుతూ,'వినూత్న కథతో రూపొందే ఈ చిత్రంతో మంచి ఫైర్ ఉన్న శివాంశును హీరోగా పరిచయం చేస్తున్నాను' అని చెప్పారు. సంగీత దర్శకుడు రాజేష్ రాజ్.టి, కెమెరామెన్ ప్రసాద్ కె.నాయుడు, ఈ చిత్రంలో కీలక పాత్రధారి ఆకెళ్ల పాల్గొని చిత్ర విశేషాలు తెలిపారు.