Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వెరైటీ కాన్సెప్ట్‌తో సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న చిత్రం 'కపటనాటక సూత్రధారి'. మనీష్ (హలీమ్) నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి క్రాంతి సైనా దర్శకత్వం వహించారు.
ఉమా శంకర్, వెంకటరామరాజు, శరత్ కుమార్, జగదీశ్వర్ రావు, శేషు కుమార్, ఎండి హుస్సేన్ సహ నిర్మాతలు. విజరు శంకర్, సంపత్ కుమార్, చందులాల్, మాస్టర్ బాబా ఆహిల్, అమీక్ష, సునీత, భానుచందర్, రవిప్రకాశ్, అరవింద్,మేక రామకష్ణ,విజరు తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని త్వరలోనే రిలీజ్ చేయడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఈ చిత్ర ఫస్ట్ లుక్‌ను రచయిత, నిర్మాత కోన వెంకట్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,'ఫస్ట్ లుక్ పోస్టర్ ఎంతో విభిన్నంగా ఉంది. చూస్తుంటే ఎంతో వైవిధ్య భరితమైన సినిమా అని తెలుస్తోంది. పోస్టర్ చూస్తుంటేనే సినిమా చూడాలనే ఆసక్తి పెరుగుతుంది. ఈ సినిమా మంచి విజయం సాధించాలి' అని చెప్పారు. ఈ చిత్రానికి డాన్స్ : జిత్తు మాస్టర్, ఎడిటర్ : ఛోటా కె ప్రసాద్, సంగీతం : రామ్ తవ్వా, నేపథ్య సంగీతం : వికాస్ బడిస, సినిమాటోగ్రఫీ : సుభాష్ దొంతి, మాటలు : రామకష్ణ, దర్శకుడు : క్రాంతి సైనా.