Authorization
Mon Jan 19, 2015 06:51 pm
యువ కథానాయకుడు రాజీవ్ సాలూరి నటిస్తున్న కొత్త చిత్రం ఉగాది పర్వ దినాన పూజ కార్యక్రమాలతో మొదలైంది. వర్ష హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రానికి ఆర్కే నల్లూరి దర్శకుడు. ఈ చిత్రాన్ని ఎస్.ఆర్.కె బ్యానర్ పతాకంపై శివ రామకష్ణ.జి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన నిర్మాత నట్టి కుమార్ కెమెరా స్విచాన్ చేయగా, నిర్మాత కె.ఎస్. రామారావు క్లాప్ కొట్టారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత శివ రామకష్ణ.జి మాట్లాడుతూ, 'ఈ సినిమా ఎంతో వెరైటీగా రాబోతుంది. దర్శకుడు ఆర్కే నల్లూరి కథ చెప్పినప్పుడే రాజీవ్ సాలూరి హీరోగా చేయాలని డిసైడ్ అయ్యాం' అని చెప్పారు. దర్శకుడు ఆర్కే నల్లూరి మాట్లాడుతూ, 'అందరిని మెప్పించే సినిమా అవుతుంది' అని అన్నారు. 'కథలో ప్రేక్షకుల్ని మెప్పించే చాలా మలుపులు ఉన్నాయి. దర్శకుడు చెప్పిన విధానం బాగుంది' అని హీరో రాజీవ్ సాలూరి తెలిపారు. ఈ చిత్రానికి సంతోష్ సనమోని సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, రోషన్ సంగీతం సమకూరుస్తున్నారు. సత్య సిరికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్.