Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గౌతమ్ రాజు తనయుడు కృష్ణ, ప్రియాంక జంటగా తెరకెక్కుతున్న చిత్రం 'విన్నారా.. ఈ ప్రేమకథ' (దాచినా దాగదు అనేది క్యాప్షన్). ప్రతాప్ ప్రొడక్షన్స్ పతాకం పై సి.హెచ్. దొరబాబు దర్శకత్వంలో డాక్టర్ శ్రీధర్ రాజు యెర్ర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఉగాది పర్వదినాన ఈ చిత్ర ప్రారంభోత్సవం నానక్‌రామ్‌గూడాలోని నరేష్ గార్డెన్లో పూజ కార్యక్రమాలతో ఘనంగా జరిగింది. ముహూర్తపు సన్నివేశానికి భరత్ పారేపల్లి కెమెరా స్విచ్ ఆన్ చేయగా, తమ్మారెడ్డి భరద్వాజ్ క్లాప్ కొట్టారు. సీనియర్ నరేష్ ఫస్ట్ షాట్ డైరెక్షన్ చేశారు.
ఈ సందర్భంగా పాత్రికేయుల సమావేశంలో నిర్మాత డాక్టర్ శ్రీధర్ రాజు యెర్ర మాట్లాడుతూ, 'ఉగాది పండగ రోజు మా చిత్రం ప్రారంభం కావటం చాలా సంతోషంగా ఉంది. మా బ్యానర్లో ఇది రెండో సినిమా. ఈ చిత్రాన్ని రేలంగి గారి కామెడీ సినిమాలాగా పల్లెటూరి నేపథ్యంలో చిత్రీకరిస్తున్నాం. కాకినాడ, రావులపల్లెం వంటి సహజ లొకేషన్స్‌లో చిత్రీకరణ జరుపుకునే మా చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుంది' అని తెలిపారు.
'ఈ సినిమా కథ చాలా బాగుంది. దొరబాబు చాలా కసితో రాసుకున్న కథ ఇది. మంచి యూత్ ఫుల్ ఎంటర్టైనర్. సరదాగా సాగే సినిమా ఇది' అని హీరో కృష్ణ చెప్పారు. హీరోయిన్ ప్రియాంక రెడ్డి మాట్లాడుతూ, 'నాకు ఈ అవకాశం ఇచ్చిన మా దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు' అని అన్నారు.
గౌతమ్ రాజు మాట్లాడుతూ, 'మంచి కంటెంట్‌తో తెరకెక్కబోతున్న ఈ చిత్రం మంచి విజయం సాధించి, నిర్మాతలకి మంచి డబ్బు రావాలి. పల్లెటూరులో జరిగే కొత్త కథ' అని తెలిపారు. 'ఇదొక మంచి లవ్ స్టోరీ. ఇప్పుడొస్తున్న ప్రేమకథలతో పోలిస్తే చాలా భిన్నమైన ప్రేమకథ. టైటిల్ కూడా చాలా కొత్తగా ఉంది' అని నరేష్ తెలిపారు.
ఈ చిత్రానికి సంగీతం : ఘంటసాల విశ్వనాథ్, కెమెరా : ఏ.కె.ఆనంద్, ఎడిటింగ్ : ప్రదీప్, పాటలు, మాటలు : పెద్దాడ మూర్తి, డాన్స్ మాస్టర్ : శైలజ గుండాల.