Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సి.హెచ్.సత్య సుమన్ బాబు హీరోగా నటిస్తూ, స్వీయదర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం 'నిత్యకళ్యాణం పచ్చ తోరణం'. ఉగాది పర్వదిన సందర్భంగా శ్రీ నగర్ కాలనీలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఈ చిత్ర స్క్రిప్ట్‌కు పూజాకార్యక్రమాలు నిర్వహించారు. 'ఈ నెల 25 నుంచి నెల్లూరులో మొదటి షెడ్యూల్ ప్రారంభం కాబోతోంది. ఆ తర్వాత అరకు, బెంగళూరులో జరిగే షెడ్యూల్స్‌తో చిత్రీకరణ పూర్తి చేయబోతున్నారు. ఆగస్ట్‌లో సినిమా రిలీజ్‌కి ప్లాన్ చేస్తున్నారు. జి.రవితేజ సమర్ఫణలో శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్‌పై సి.హెచ్.సత్య సుమన్‌బాబు నిర్మిస్తున్న చిత్రమిది. ఆయన హీరోగా నటిస్తున్న రెండో చిత్రమిది. సుమన్, షియాజీ షిండే, చలపతి, నరేష్, అన్నపూర్ణమ్మ ఇతర కీలక పాత్రల్లో నటించబోతున్నారు. టెక్నికల్‌గా హై స్టాండర్డ్స్‌లో ఉండబోతున్న ఈ చిత్రానికి మాటలు : రామకష్ణ, సంగీతం:ప్రమోద్ పులిగిళ్ల, సినిమాటోగ్రఫీ:అడపా సతీష్, ఆర్ట్ : నాని, ఆర్.ఆర్ : చిన్నా, నిర్మాత, దర్శకత్వం : సి.హెచ్.సత్య సుమన్ బాబు.