Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సంపూర్ణేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న చిత్రం 'బజార్ రౌడీ'. వసంత నాగేశ్వరరావు దర్శకుడు. కె ఎస్ క్రియేషన్స్ పతాకంపై బోడెంపూడి కిరణ్ కుమార్ సమర్పణలో ఈ సినిమాను సంధిరెడ్డి శ్రీనివాసరావు నిర్మిస్తున్నారు. 'శేఖర్ అలవలపాటి నిర్మాణ సారధ్యంలో ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్, టీజర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. సంపూర్ణేష్ బాబు పక్కా మాస్ క్యారెక్టర్లో ప్రేక్షకులను అలరిస్తున్నారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉంది. సీనియర్ రైటర్ మరుధూరి రాజా ఈ సినిమాకు మాటలు రాయటం ఓ విశేషమైతే, దాదాపు 1000 సినిమాలకు పైగా ఎడిటింగ్ చేసిన సీనియర్ ఎడిటర్ గౌతంరాజు ఈ సినిమాకి పని చేయడం మరో విశేషం. ఎస్ఎస్ ఫ్యాక్టరీ సంగీతం సమకూర్చిన ఈ సినిమాకి ఎ. విజరు కుమార్ సినిమాటోగ్రఫీ అందించారు. ఏప్రిల్ నెలాఖరులో ఈ సినిమాని విడుదల చేయడానికి దర్శక, నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. సంపూ నటిస్తున్న ఈ సినిమాపై అన్ని వర్గాల ప్రేక్షకుల్లోను, ఆయన అభిమానుల్లోనూ భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలకు మించి ఈ సినిమా ఉంటుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేశారు' అని చిత్ర బృందం తెలిపింది. మహేశ్వరి, షాయాజీ షిండే, పథ్వి, కత్తి మహేష్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి దర్శకుడు: వసంత నాగేశ్వరరావు, నిర్మాత: సంధిరెడ్డి శ్రీనివాసరావు, ఎగ్జిక్యూటివ్ నిర్మాత : శేఖర్ అలవలపాటి, సమర్పణ: బోడెంపూడి కిరణ్ కుమార్, మాటలు: మరుధూరి రాజా, సంగీతం: ఎస్ఎస్ ఫ్యాక్టరీ.