Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాంకి (వీర్నాల రామకృష్ణ), దివ్యా రావు (డిగ్రీ కాలేజ్ ఫేమ్), ఆస్మ, యాంకర్ శ్యామల, పోసాని కృష్ణ మురళీ ముఖ్య పాత్రధారులుగా నటించిన చిత్రం 'రాజా'. ఎ.ఆర్కె ఆర్ట్స్ సమర్పణలో యూత్ అడల్ట్ కంటెంట్ సినిమాగా తెరకెక్కిన ఈ చిత్రం నేడు (శుక్రవారం) ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా హీరో, దర్శకుడు రాంకి (వీర్నాల రామకృష్ణ) మాట్లాడుతూ, 'ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా ఉంటుంది. గతంలో మేము విడుదల చేసిన సినిమా ఫస్ట్‌లుక్, మోషన్ పోస్టర్, టీజర్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఎంతలా అంటే కేవలం 10 రోజుల్లోనే మా సినిమా బిజినెస్ క్లోజ్ చేసే అంతలా బయ్యర్స్ నుంచి ఆఫర్ వచ్చింది. ముఖ్యంగా యూత్ ఈ సినిమాకు బాగా కనెక్ట్ అవుతారు. అడల్ట్ కామెడీ ఎంటర్టైనర్గా యూత్‌ని విశేషంగా అలరిస్తుంది. హీరోయిన్లు దివ్యా రావ్ (డిగ్రీ కాలేజ్ ఫేమ్), ఆస్మ చాలా బాగా నటించారు.యాంకర్ శ్యామల కూడా ఎంతో బిజీగా ఉన్నా మేం అడిగిన వెంటనే మాకు చాలా బాగా సపోర్ట్ చేశారు. అలాగే మిగిలిన అరిస్టులు కూడా బాగా సపోర్ట్ చేశారు. వీళ్ళతో పనిచేయడం నాకు చాలా కంఫర్ట్ అనిపించింది. ఫస్ట్ టైం నటిస్తున్నాననే ఫీలింగ్ లేకుండా చేశారు. ముఖ్యంగా పోసాని కృష్ణ మురళీగారు మా సినిమాలో నటించి, నన్ను ఎంతో ఎంకరేజ్ చేశారు. ఆయన చేసిన కామెడీ సినిమాలో హైలైట్. ఎంతో హెల్దీగా తన కామెడీ టైమింగ్‌తో నవ్వించారు. ఇది మహిళల ఇమేజ్‌ని పెంచే ఓ మంచి మెసేజ్ ఉన్న సినిమా. రొమాన్స్ విషయంలో మహిళల ఫీలింగ్స్ ఎలా ఉంటాయనేది చాలా సున్నితంగా తెర మీద చూపించాం' అని తెలిపారు.
చిత్ర నిర్మాత మాట్లాడుతూ, 'సినిమా చాలా బాగా వచ్చింది. సినిమా రిలీజ్‌కు ముందే బిజినెస్ అయిపోవడం, అలాగే థియేట్రికల్ రైట్స్‌ని వేరే వాళ్ళు తీసుకుని రిలీజ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. మా కంటెంట్‌లో విషయం ఉంది. కాబట్టి మాకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా విడుదల చేస్తున్న రెండు రాష్ట్రాల డిస్ట్రుబ్యూటర్లకు ధన్యవాదాలు' అని చెప్పారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: డి.గురువరవ్, డిఓపి: రాజు, ఎడిటర్: బి.ఎన్.ఆర్., ఆర్.ఆర్.: తమిరి శంకర్, లిరిక్స్: రామజోగయ్య శాస్త్రి, హరి గౌర, కసర్ల శ్యామ్, స్టొరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, డైరెక్షన్: రాంకి (రామకృష్ణ), డైలాగ్స్: రాంకి, జి.రవి, విజయ్.