Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శంకర్, విక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కి తెలుగు, తమిళ భాషల్లో సంచలన విజయం సాధించిన చిత్రం 'అపరిచితుడు'. తాజాగా ఈ చిత్రాన్ని రణ్వీర్ సింగ్ హీరోగా శంకర్ బాలీవుడ్లో రీమేక్ చేసేందుకు రంగం సిద్ధం చేశారు. అయితే తన పర్మిషన్ లేకుండా ఈ చిత్రాన్ని దర్శకుడు శంకర్‌కి బాలీవుడ్లో రీమేక్ చేసే హక్కు లేదని 'అపరిచితుడు'(అన్నియన్) నిర్మాత ఆస్కార్.వి.రవిచంద్రన్ అన్నారు. ''అన్నియన్' చిత్రానికి సంబంధించిన కథను స్వర్గీయ సుజాత గారి దగ్గర నుంచి తాను హక్కులు కొనుగోలు చేశానని, పూర్తి హక్కులు తన దగ్గర ఉంటే, తనని సంప్రదించకుండా ఆ సినిమాని రీమేక్ చేయడం ఏంటని శంకర్‌ని ప్రశ్నించారు. కాదు, కూడదు అంటే లీగల్ సమస్యలను ఫేస్ చేయాల్సి ఉంటుందని హెచ్చరిస్తూ శంకర్‌కు నిర్మాత రవిచంద్రన్ ఇ-మెయిల్ పంపారు. దీనికి దర్శకుడు శంకర్ స్పందిస్తూ, 'కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం శంకర్ అని టైటిల్స్‌లో పడుతుంది. ఈ చిత్ర కథ మొత్తం నాదే. మీరు సుజాతగారి దగ్గర రైట్స్ తీసుకున్నానని చెప్పడం సరైంది కాదు. సుజాతగారి పాత్ర కేవలం డైలాగ్స్ వరకు మాత్రమే పరిమితం. కాబట్టి ఈ సినిమాని రీమేక్ చేసుకునే హక్కు నాకు మాత్రమే ఉంది. ఇలా హక్కులు నావంటూ.. నా ప్రాజెక్ట్స్ ద్వారా గుర్తింపు పొందాలను కోవడం దురదష్టకరం. నా వివరణ తర్వాత మీరు.. మీ బుద్ది మార్చుకుంటారని భావిస్తున్నాను. నిరాధారమైన వార్తలతో, కోర్టులు అంటూ బెదిరించడం మానుకోండి. నా కెరీర్‌పై జరుగుతున్న ఇటువంటి అన్యాయమైన ఆరోపణలను ఖండిస్తున్నాను' అంటూ ఘాటుగా ఆన్సర్ ఇచ్చారు.