Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తేజ సజ్జా తాజాగా నటించిన చిత్రం 'ఇష్క్'. ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్గా నటిస్తోన్న ఈ చిత్రంతో యస్.యస్. రాజు దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఆర్.బి.చౌదరి సమర్పణలో ఎన్వీ ప్రసాద్, పారస్ జైన్, వాకాడ అంజన్ కుమార్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మెగా సూపర్ గుడ్ ఫిల్మ్స్ పతాకంపై నిర్మితమైన ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, సాంగ్స్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈనెల 23న గ్రాండ్‌గా విడుదలవుతున్న ఈ చిత్ర ట్రైలర్‌ను గురువారం హీరో సాయి తేజ్ విడుదల చేశారు. ఈ సందర్భంగా రామానాయుడు స్టూడియోస్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వాకాడ అప్పారావు మాట్లాడుతూ, 'ఇందులో తేజ, ప్రియా ప్రకాష్ వారియర్లతో పాటు తమిళ నటుడు రవీందర్ ఒక ముఖ్య పాత్ర పోషించారు. ప్రేక్షకులు మా సినిమాని ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను' అని చెప్పారు. చిత్ర దర్శకుడు యస్.యస్.రాజు మాట్లాడుతూ, 'ఈ సినిమాని 29 రోజుల్లో, ఇంత క్వాలిటీగా చేయడానికి కారణం నిర్మాణ పరంగా ఎన్వీప్రసాద్గారు, స్క్రిప్ట్ లెవల్ నుంచి అప్పారావు, పిక్చర్ క్వాలిటీ పరంగా శ్యామ్.కె.నాయుడు బాగా సహకరించారు. మహతి స్వరసాగర్ మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఓ మంచి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాం' అని తెలిపారు. హీరో తేజ సజ్జా మాట్లాడుతూ, 'మా ట్రైలర్‌ని విడుదల చేసిన హీరో సాయితేజ్‌కి ధన్యవాదాలు. అలాగే 'ఇష్క్' టైటిల్‌తో నితిన్ సినిమా కూడా ఉంది. మీ సినిమా టైటిల్ ఉపయోగించుకుంటున్నాం అనగానే నితిన్‌గారు సరే అనడమే కాకుండా, మా సినిమాలోని 'ఆనందం...' సాంగ్‌ని కూడా ఆయన రిలీజ్ చేశారు. ఈ నెల 23న మా సినిమా థియేటర్స్‌లో వస్తుంది. ఇదొక కొత్త రకం కథ. 'జాంబీరెడ్డి' వంటి డిఫరెంట్ జోనర్ తర్వాత నేను చేసిన సినిమా ఇది. సినిమా ఆద్యంతం ఉత్కంఠభరితంగా ఉంటుంది. ఆడియన్స్‌కు న్యూ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే సినిమా ఇది. కొంత గ్యాప్ తర్వాత వస్తున్న మెగా సూపర్‌గుడ్ ఫిలింస్ వారు ఫస్ట్ సినిమా నాతో చేయడం సంతోషంగా ఉంది. ఈ సినిమాలో మంచి కంటెంట్ ఉంది. తప్పకుండా ఆడియన్స్‌కి నచ్చే చిత్రమిది' అని చెప్పారు.