Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సినిమాలను పూర్తి చేసే విషయంలో అగ్ర కథానాయకుడు వెంకటేష్ జెట్ స్పీడ్‌లో ఉన్నారు. ఈ ఏడాది ఆయన మూడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. వాటిల్లో రెండు సినిమాలు రీమేక్‌లు కావడం విశేషం. తమిళంలో ధనుష్ హీరోగా నటించిన 'అసురన్' సినిమాని 'నారప్ప'గా తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్‌ప్రొడక్షన్స్ వర్క్ జరుగుతున్న ఈ సినిమాని మే 14న రిలీజ్ చేయబోతున్నట్టు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో వెంకీ సరసన ప్రియమణి నటించారు.
అలాగే మలయాళంలో ఘన విజయం సాధించిన 'దృశ్యం 2' తెలుగు రీమేక్‌లో వెంకటేష్ నటిసున్న సంగతి తెలిసిందే. వెంకీకి జంటగా మీనా నటిస్తుండగా, ఒరిజినల్ వెర్షన్‌ను తెరకెక్కించిన జీతు జోసెఫ్ ఈ రీమేక్‌కి కూడా దర్శకత్వం వహిస్తున్నారు. ఇదిలా ఉంటే, ఈ సినిమాకి సంబంధించిన వెంకీ పార్ట్ చిత్రీకరణ పూర్తయ్యిందని చిత్ర బృందం సోషల్ మీడియా వేదికగా తెలిపారు. అలాగే వెంకీతో నటిస్తున్న తారాగణంతోపాటు దర్శకుడు జీతూ జోసెఫ్ ఉన్న ఓ ఫొటోని సైతం అభిమానులతో షేర్ చేసుకున్నారు.
ఇక, అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకీ 'ఎఫ్ 3' చేస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉంది. వరుణతేజ్ మరో కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రంలో తమన్నా, మెహరీన్‌లు కథానాయికలుగా నటిస్తున్నారు.