Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గ్రీన్ క్రాస్ థియోసోఫికల్ రూరల్ అండ్ అర్బన్ డెవలప్ మెంట్ సొసైటీ సమర్పణ లో రూపొందుతున్న చిత్రం 'వధుకట్నం'. షబాబు ఫిలిమ్స్ పతాకంపై భార్గవ గొట్టిముక్కల దర్శకత్వంలో షేక్ బాబు సాహెబ్ నిర్మించారు. ఈ చిత్రానికి సంబంధించి 'ఇలా జరగొచ్చేమో.. బీ రెడీ ఫర్ రిలీజ్' పోస్టర్‌ను నటి హేమ రిలీజ్ చేశారు. 'స్కానింగ్‌లో ఆడ శిశువు అని తెలుసుకుని, అబార్షన్స్ చేయించడం వల్ల ఆడ పిల్లల నిష్పత్తి తగ్గి పెళ్ళికి మగ పిల్లలకు ఆడ పిల్లలే దొరక్కపోతే, అమ్మాయిలకే 'వధుకట్నం' ఇవ్వాల్సిన రోజులు వస్తాయనే సందేశంతో ఈ చిత్రం రూపొందింది' అని నటి హేమ తెలిపారు. 'ఈ చిత్రాన్ని చూసిన సెన్సార్ సభ్యులు మంచి సందేశాత్మక చిత్రమని అభినందించి, యు/ఎ సర్టిఫికెట్ ఇవ్వడం ఆనందంగా ఉంది. 'సేవ్ ది గర్ల్ చైల్డ్' అనే ప్రధానాంశంగా ఈ చిత్రం తెరకెక్కింది' అని దర్శకుడు భార్గవ గొట్టిముక్కల అన్నారు. నిర్మాత షేక్ బాబు సాహెబ్ మాట్లాడుతూ, 'అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా చక్కటి సందేశాత్మక, హాస్యరస, కుటుంబ కథా చిత్రమిది' అని చెప్పారు. హర్ష, ప్రియ , రఘు , కవిత , ఆర్యన్ , రేఖ , కుషాల్ , అనోన్య , మణి చందన తదితరులు ఈ చిత్రంలో ముఖ్య పాత్రలు పోషించారు.