Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హన్సిక మోట్వాని ముఖ్య పాత్రధారిణిగా రాజు దుస్సా దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం '105 మినిట్స్ '. సెల్యూలాయిడ్ పతాకం పై బొమ్మక్ శివ నిర్మాణంలో ఇండియన్ స్క్రీన్ పై మొట్టమొదటి సారిగా ఒకే ఒక్క క్యారెక్టర్‌తో, ఎడిటింగ్ లేకుండా ఉత్కంఠ భరితంగా సాగిపోయే కథా కథనంతో చేస్తున్న సింగిల్ షాట్ చిత్రమిది. ఈ చిత్రం గురించి దర్శకుడు రాజు దుస్సా మాట్లాడుతూ,' 'సింగిల్ షాట్, సింగిల్ క్యారెక్టర్, రీల్ టైమ్ అండ్ రియల్ టైమ్ ఈ చిత్రానికి హైలైట్స్ అవుతాయి. మునుపెన్నడూ లేని విధంగా హన్సిక ఒక డిఫరెంట్ క్యారెక్టర్లో కనిపించ బోతోంది' అని తెలిపారు. 'ఈ చిత్రం నా కెరీర్ లోనే ఒక మైలురాయి గా నిలిచి పోతుంది. ఇలాంటి ప్రయోగాత్మక చిత్రంలో నటిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది' అని హన్సిక చెప్పారు. 'ఈ సినిమా మేకింగ్ నాకొక ఛాలెంజ్' అని సినిమాటోగ్రాఫర్ దుర్గా కిషోర్ అన్నారు.
'ఇలాంటి చిత్రాన్ని మా బ్యానర్లో నిర్మించడం చాలా హ్యాపీగా ఉంది. చిత్ర నిర్మాణ విలువలు ఎక్కడా తగ్గకుండా అన్ని కమర్షియల్ హంగులతో నిర్మిస్తున్నాం' అని నిర్మాత బొమ్మక్
శివ తెలిపారు.