Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రెడ్ కార్పెట్ రీల్ ప్రొడక్షన్ పతాకంపై అంకిత, అవంతిక, మేఘన, నగరం సునీల్, జబర్దష్ అప్పారావు నటీ నటులుగా రూపొందిన చిత్రం 'బి.కాంలో ఫిజిక్స్'. సామ్ జె చైతన్య స్వీయ దర్శకత్వంలో నిర్మితమవుతున్న ఈ చిత్ర ట్రైలర్‌ని శనివారం ప్రసాద్ లాబ్స్‌లో విడుదల చేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సీనియర్ దర్శకుడు శివనాగేశ్వరరావు చిత్ర ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 'ట్రైలర్ చాలా బాగుంది. ఈ సినిమాలో బోలెడు కంటెంట్‌తో పాటు బోల్డ్ కంటెంట్ కూడా ఉంది. సున్నితమైన అంశాన్ని చక్కగా తెరకెక్కిస్తూ, ఒక మంచి ప్రయోగం చేశారు' అని చెప్పారు. ''ఆవు పులి మధ్యలో ప్రభాస్ పెళ్లి', 'ఏడు చేపల కథ' తర్వాత నిర్మిస్తున్న చిత్రమిది. దీనికి దర్శకత్వం కూడా వహిస్తున్నాను. రేప్‌కి గురైన ఒక అమ్మాయి సెక్స్ ఆర్గాన్స్ ట్రాన్స్‌ప్లాంట్ చేసుకుని, తనని రేప్ చేసిన అబ్బాయినే రేప్ చేసి రివేంజ్ తీర్చుకుంటుంది. వినడానికి కథలో లాజిక్ లేకున్నా ఈ కథలో కామెడీని జోడించి ప్రయోగాత్మకంగా తీశాం. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని మేలో రిలీజ్ చేస్తాం' అని దర్శక, నిర్మాత సామ్.జె.చైతన్య తెలిపారు. హీరోయిన్స్‌లో ఒకరైన మేఘన మాట్లాడుతూ,'ఇప్పటి వరకు చేయని భిన్న పాత్రను ఈ సినిమాలో చేశాను' అని అన్నారు.