Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తేజ సజ్జా, ప్రియా ప్రకాశ్ వారియర్ జంటగా నటించిన చిత్రం 'ఇష్క్'. మెగా సూపర్ గుడ్ ఫిలిమ్స్ పతాకంపై యస్.యస్.రాజు దర్శకత్వం వహించారు. ఆర్.బి.చౌదరి సమర్పణలో ఎన్వీ ప్రసాద్, పారస్ జైన్, వాకాడ అంజన్ కుమార్ నిర్మించిన ఈ చిత్రం ఈనెల 23న విడుదల కానుంది. ఈ సందర్భంగా కథానాయిక ప్రియా ప్రకాశ్ వారియర్ శనివారం మీడియాతో ముచ్చటించింది. ఆ విశేషాలు ఆమె మాటల్లోనే.. ''నితిన్ 'చెక్' సినిమా తర్వాత నేను చేసిన చిత్రమిది. ఒక కొత్త సబ్జెక్ట్‌తో రూపొందింది. ఈ కథకు ప్రతి ప్రేక్షకుడు రిలేట్ అవుతాడు. సినిమాలో ప్రతి సీన్ కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. నెక్ట్స్ సీన్లో ఏం జరుగుతుందా? అనే ఎగ్జైట్మెంట్ సినిమా చూస్తున్నంత సేపూ ప్రేక్షకుల మైండ్‌లో ఉంటుంది. ఆడియెన్స్‌ని థ్రిల్ చేసే సినిమా ఇది. ఇందులో నేను అనసూయ అనే విలేజ్ అమ్మాయి పాత్రలో నటించాను. సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న కాలేజ్ అమ్మాయిగా నా క్యారెక్టర్ డిఫరెంట్‌గా ఉంటుంది. క్యారెక్టర్ సోల్‌ను మైండ్‌లో పెట్టుకుని నా స్టైల్ ఆఫ్ యాక్టింగ్ చేయమని దర్శకుడు రాజు నాకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. తేజ సజ్జా మంచి కో స్టార్. మెగాసూపర్ గుడ్ ఫిలింస్ వంటి మంచి బ్యానర్లో సినిమా చేయడం నా కెరీర్‌కు ఫ్లస్ అవుతుంది. ఈ సినిమా ఓ మలయాళ సినిమాకి రీమేక్. ఆ సినిమా బేస్ లైన్ నాకు బాగా నచ్చింది. తెలుగు ప్రేక్షకులకు తగ్గట్లుగానే దర్శకుడు కథలో కొన్ని మార్పులు చేశారు. సినిమాల జయాపజయాల నుంచే మనం ఎక్కువ నేర్చుకోగలం. ఇప్పటివరకు నేను చేసిన రోల్స్ అన్ని నాకు డిఫరెంట్‌గానే అనిపించాయి. సందీప్‌కిషన్ మూవీలో నేనొక కీలక పాత్ర చేస్తున్నాను' అని ప్రియా ప్రకాశ్ వారియర్ అన్నారు.